ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh: పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్‌తో అంధకారంలో 14 కోట్ల మంది

ABN, First Publish Date - 2022-10-05T01:31:52+05:30

బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ముదురుతోంది. మంగళవారంనాడు మధ్యాహ్నం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో విద్యుత్ సంక్షోభం ముదురుతోంది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ (National power grid) ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల కరెంట్ నిలిచిపోయింది. సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది. అన్ని పవర్ ప్లాంట్లు ట్రిప్ అయ్యాయని, రాజధాని ఢాకా సహా పలు ప్రధాన నగరాల్లో కరెంట్ నిలిచిపోయందని విద్యుత్ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సమస్యను ఇంజనీర్లు గుర్తించే  ప్రయత్నం చేస్తున్నారని, సమస్య గుర్తించి పరిష్కరించేందుకు కొన్ని గంటలు పడుతుందని ఆయన తెలిపారు.


పెరిగిన చమురు ధరల కారణంగా చమురు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో భారీగా తగ్గించింది.  ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మొత్తానికి అవసరమైన విద్యుత్‌లో 6 శాతం మాత్రమే చమురు ద్వారా ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం అక్కడ గార్మెంట్ పరిశ్రమల్లో కరెంట్ 4 నుంచి 10 గంటలు వరకూ ఉండటం లేదు.  ప్రపంచంలోనే బంగ్లాదేశ్ రెండో అతిపెద్ద గార్మెంట్ ఎగుమతి దారుగా ఉంది. అయితే, విద్యుత్ కోతల కారణంగా ఆ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి 7.1 నుంచి 6.6 శాతానికి తగ్గనుందని ఆసియన్ డవలప్‌మెంట్ బ్యాంకు గత నెలలో అంచనా వేసింది

Updated Date - 2022-10-05T01:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising