ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వేల రష్యన్ సైన్యం, 250 ట్యాంకులు మట్టుబెట్టాం: ఉక్రెయిన్

ABN, First Publish Date - 2022-03-04T22:13:02+05:30

10 వేల రష్యన్ సైన్యం, 250 ట్యాంకులు మట్టుబెట్టాం: ఉక్రెయిన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: రష్యాకు చెందిన 10 వేల మంది సైనికులు, 251 యుద్ధ ట్యాంకులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. శుక్రవారం ఉక్రెయిన్ సైన్యం స్పందిస్తూ మార్చి 4 వరకు తమ దేశంలో ప్రవేశించిన రష్యన్ దళాలపై దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. 9,166 మంది రష్యాన్ సైనికులను ఉక్రెయిన్ మట్టుబెట్టింది. అలాగే 50 ఎంఎల్ఆర్ఎస్ వాహనాలు, 33 వార్ ప్లేన్లు, 37 హెలికాప్టర్లు, 404 కార్లు, 2 బోట్లు, 251 యుద్ధ ట్యాంకులు, 60 ఇంధన వాహనాలు, 105 ఆర్టిలరీ పీసెస్, 3 యూఏవీలు, 939 ఆర్మ్‌డ్ పర్సనల్ వాహనాలు, 18 ఆంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్‌లు ధ్వంసం చేసినట్లు తెలిపారు.


ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభమై వారం రోజులు గడిచాక.. రష్యాకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. రష్యా దళాలు తమ సరిహద్దు నుంచి 500 కిలోమీటర్లు దాటి కీవ్‌ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బస చేశాయి. కానీ, ముందుకు సాగలేకపోతున్నాయి..! కారణం.. వేల మంది సైనికులకు ఆహారంఅందక అలమటిస్తున్నారు. వందల యుద్ధ ట్యాంకుల్లో ఇంధనం అయిపోయింది. దీంతో.. ఒకే చోట పెద్ద సంఖ్యలో సైనికులు, యుద్ధ ట్యాంకులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. రష్యా సైనికుల తాజా దాడిలో యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. రష్యా సైనికులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-04T22:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising