ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిపై ఆకృత్యం.. 103 ఏళ్ల వృద్ధుడికి పదేళ్ల జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-03-18T21:40:19+05:30

పదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనలో 103 ఏళ్ల వృద్ధుడికి పదేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. తమిళనాడులోని పొన్నామల్లీ పరిధిలోని సన్నీర్‌కుప్పంలో జరిగింది ఈ ఘటన.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటనలో 103 ఏళ్ల వృద్ధుడికి పదేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. తమిళనాడులోని పొన్నామల్లీ పరిధిలోని సన్నీర్‌కుప్పంలో జరిగింది ఈ ఘటన. సన్నీర్‌కుప్పంలో పరశురామన్ అనే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ తన ఇంటి సమీపంలోనే ఏదు ఇళ్లు కట్టి, అద్దెకిచ్చాడు. 2018లో ఆ ఇళ్ల పరిధిలో ఉన్న పదేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశచూపి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికకు ఒక రోజు కడుపునొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు విషయం ఆరాతీయగా పరశురామ్ ఆకృత్యం వెలుగుచూసింది. దీంతో జూలై 7, 2018న స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు పరశురామ్‌పై ఫిర్యాదు చేశారు. ఘటనకు పాల్పడ్డ సమయంలో అతడి వయసు 99. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. విచారణలో వృద్ధుడు నేరాన్ని అంగీకరించాడు. విచారణ అనంతరం తిరువళ్లూర్ మహిళా కోర్టు నిందితుడికి తాజాగా శిక్ష ఖరారు చేసింది. నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు బాలికకు పరిహారం కింద 45,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. 

Updated Date - 2022-03-18T21:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising