ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిరిపోయిన బీటింగ్ రిట్రీట్.. ఆకాశంలో మెరిసిన భారత్!

ABN, First Publish Date - 2022-01-30T03:00:40+05:30

భారత 73వ గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిర్వహించిన బీటింగ్ రిట్రీట్ వేడుకలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారి 10 నిమిషాల నిడివితో స్వదేశీ డ్రోన్లతో లేజర్ ప్రదర్శన నిర్వహించారు.


సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు (టీడీబీ) నిధులతో ప్రారంభమైన ఇండియన్ స్టార్టప్ ‘బోట్‌ల్యాబ్’ 1000 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన నిర్వహించింది.


భారత మువ్వన్నెల జెండా, జాతీయ జంతువు, జాతీయ పుష్పం, మహాత్మాగాంధీ వంటి ఆకృతుల్లో ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ కనువిందు చేశాయి. వీటికి అనుగుణంగా దేశభక్తి ట్యూన్లను ప్లే చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలను ఇతివృత్తంగా ఈ షో నిర్వహించారు. కాగా, ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా నేటితో భారత్ కూడా వాటి సరసన చేరింది. 

Updated Date - 2022-01-30T03:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising