ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపై కాల్పులు

ABN, First Publish Date - 2022-04-20T01:23:30+05:30

కొలంబో : దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పొరుగుదేశం శ్రీలంకలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెల్లుబుకుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పొరుగుదేశం శ్రీలంకలో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఆగ్రహ జ్వాలలు తీవ్ర స్థాయిలో పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నవారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక శ్రీలంక పౌరుడు మరణించాడు. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడడంతోనే కాల్పులు జరపాల్సివచ్చిందని శ్రీలంక పోలీస్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారని, అందుకే పరిస్థితి దిగజారిందని వివరించారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబోకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంబుక్కనలో ఆందోళనకారులు మంగళవారం ఉదయం రోడ్లను బ్లాక్ చేశారు. తీవ్రమైన ఆయిల్ కొరత, అధిక ధరలను నిరసిస్తూ ఈ ఆందోళనలు చేశారు.  వేలాది వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో రోడ్లపై టైర్లను తగలబెట్టారు. రాజధాని కొలంబోకు వెళ్లే రోడ్లను స్థంభింపజేశారు. హింసాత్మక చర్యలకు పాల్పడడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

Updated Date - 2022-04-20T01:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising