ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Toxic Gas Leak: కెమికల్ యూనిట్‌లో విషవాయువు లీకేజీ...ఒకరు మృతి

ABN, First Publish Date - 2022-09-04T21:16:06+05:30

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రగ్స్, ఫార్మూస్యూటికల్స్ తయారీ కంపెనీ ప్లాంట్‌లో విషవాయువు లీక్ కావడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


కాగా, గ్యాస్ లీకేజీతో అక్కడ పనిచేస్తున్న కార్మికులకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని జిల్లా డిజాస్టర్ మేనేజిమెంట్ సెల్ చీఫ్ వివేకానంద కదమ్ తెలిపారు. మృతిచెందిన కార్మికుని భగవత్ చౌపాల్ (22)గా గుర్తించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ సహా ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ డైరెక్టరేట్ అధికారులు హుటాహుటిన ప్లాంట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-09-04T21:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising