ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా బాబు వర్క్ షాప్‌కి పోతుంటే నా గుండె పగిలేది...

ABN, First Publish Date - 2022-01-06T17:17:42+05:30

నా కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ గురించి నాకు చెప్పడానికి హాస్పిటల్ వాళ్లు నాకు కాల్ చేసినప్పుడు ఇంత ఘోరం జరుగుతుందని నేను నమ్మలేకపోయాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ గురించి నాకు చెప్పడానికి హాస్పిటల్ వాళ్లు నాకు కాల్ చేసినప్పుడు ఇంత ఘోరం జరుగుతుందని నేను నమ్మలేకపోయాను. నేను అక్కడికి చేరేసరికే మా బాబును ఎమర్జెన్సీ సర్జరీ చెయ్యడానికి తీసుకెళ్లారు.గతేడాది నవంబర్ 22న ఒక ఆటోరిక్షా ఢీకొట్టడంతో 12 ఏళ్ల నా కొడుకు సన్‌బార్ మూత్రపిండాలు, పేగులు బాగా పాడయ్యాయి.


నా కొడుకు మీదకి ఒక బండి వచ్చి పడిందన్న ఆలోచన వస్తేనే నేను నిలువెల్లా వణికిపోతున్నాను. ఆ రోడ్డు మీద వాడు ఎంత బాధతో నలిగిపోయి ఉంటాడోనని తలుచుకుని తట్టుకోలేకపోతున్నాను. ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్లు వచ్చి మా వాడికి తగిలిన దెబ్బలు, గాయాల గురించి చెప్పారు.మూత్రపిండాల రక్త సరఫరా వ్యవస్థ దెబ్బతిందని, జీర్ణ వ్యవస్థ కూడా పాడైందని, అయితే ఆపరేషన్ ద్వారా చాలావరకూ సరి చేసి విజయవంతం చేశామని డాక్టర్లు చెప్పారు.ఆస్పత్రిలో 2 వారాలు గడిపిన తర్వాత డిసెంబర్ 7వ తేదీన బాబును డిశ్చార్జి చేశారు. కానీ, ఆ తర్వాత వారం రోజుల్లోనే మా అబ్బాయికి అనారోగ్యం తిరగబెట్టింది. మరో దారి లేక మళ్లీ ఆస్పత్రిలో చేర్చాను.


          ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి..


మా అబ్బాయి యాక్సిడెంట్ వల్ల దెబ్బతిన్న అంతర్గత అవయవాలను సరిచేసేందుకు డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అవి మళ్లీ ఇన్ఫెక్ట్ అయ్యాయి. ప్రమాదం వల్ల అయిన గాయాల నుంచి బాబు పూర్తిగా కోలుకోవడానికి అయ్యే మందులు, చికిత్సకు కనీసం మరో 25 రోజులు పడుతుందని చెప్పారు.ఇప్పుడు మా బాబుకు చికిత్స, వైద్య సంరక్షణ కోసం మొత్తం రూ.12 లక్షలు ($ 16149.76) అవసరమవుతాయి.


నాకు మొదటగా నా కూతురు ఫర్జానా పుట్టినప్పుడు నా మాతృత్వాన్ని ఎంతో ఆనందించాను. తర్వాత సన్‌బార్ పుట్టాడు. మూడేళ్ళ క్రితం రేహాన్‌కు జన్మనిచ్చాను. ఆ తర్వాత నా భర్త మరణించే వరకూ నా కుటుంబం ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా కాలం గడిపింది.నాకు కుట్లు, అల్లికల పనిలో నైపుణ్యం ఉన్నందువల్ల ఆ పని చేస్తూ నా పిల్లల్ని పోషించుకుంటున్నాను.నెలకు నాకు వచ్చే రూ.2,000 స్వల్ప ఆదాయంతో నా పిల్లలకు సరిగ్గా తిండి పెట్టడమే కష్టమవుతోంది. ఇప్పుడు నా కొడుక్కి వైద్యం కోసం ఇంత పెద్ద ఖర్చు ఎలా భరించాలి?


  ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి..



నెల రోజుల కిందట మా బాబు బాధతో మెలికలు తిరిగిపోతుంటే కూతురి పెళ్లి కోసం దాచిన నగలన్నీ అమ్మేసి వైద్యం చేయించాను. కానీ ఇప్పుడు నా కొడుకు జీవితం కోసం పోరాడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఖర్చుల్ని భరించే స్తోమత నాకు లేదు.లాక్ డౌన్‌లు పెట్టినప్పుడయితే ఆ క్లిష్ట సమయంలో నా పిల్లలతో బతుకు నెట్టుకురావడం అతి కష్టంగా మారింది.అప్పట్లో నా కొడుకు సన్‌బార్‌ని కూడా వర్క్ షాపులో పనికి వెళ్లమని, కాస్త డబ్బు సంపాదించమని చెప్పాల్సి వచ్చింది. తల్లిగా విఫలమైన నేను ఇప్పుడు వాడి చికిత్స ఆలస్యం అవుతుంటే చూస్తూ ఎలా ఉండగలను?


లాక్ డౌన్ సమయంలో కేవలం 12 ఏళ్ల వయస్సున్న ఈ పిల్లాడు నాకు, తన తోబుట్టువులకు తోడై నిలిచి ఎంతో సాయం చేశాడు. వాడు పొద్దుటే వర్క్ షాపులో పనికి వెళుతుంటే నా గుండె పగిలేలా రోదించేదానిని. నాకు మరో దారి లేదు.ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ మా అబ్బాయిని నాకు దూరం చేస్తుందేమోనని ఎంతో భయమేస్తోంది.


దయచేసి నాకు సాయం చెయ్యండి.మా అబ్బాయికి మంచి చికిత్స జరిగి పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడంలో పెద్ద మనస్సుతో నాకు సహకరించండి.


   ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ అబ్బాయికి సాయం చెయ్యండి..

Updated Date - 2022-01-06T17:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising