WHO Tedros: నా బంధువును చంపేశారు.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ ఆవేదన
ABN, First Publish Date - 2022-12-15T21:52:12+05:30
పొరుగు దేశమైన ఇరిట్రియా దళాల దాడిలో తన బంధవును(వరుసకు మావయ్య) చనిపోయారని ప్రపంచఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ బుధవారం ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పొరుగు దేశమైన ఎరిట్రియా(Eritrea) దళాల దాడిలో తన బంధవును(వరుసకు మావయ్య) చనిపోయారని ప్రపంచఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్(Tedros Adhanom) బుధవారం ప్రకటించారు. టైగ్రే ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ‘‘ఎరీట్రియన్ ఆర్మీ జరిపిన దాడిలో నా బంధువు మరణించినట్టు మా అమ్మ చెప్పింది. ఈ ఘటనతో మా అమ్మ తీవ్ర సోకంలో మునిగిపోయింది. ఆమె పుట్టింటి వారిలో అతడే అత్యంత పిన్న వయస్కుడు. అతడిది దాదాపు నా వయసే’’ అని జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
గతంలో ఇథియోపియా(Ethiopia) మంత్రిగా పనిచేసిన టెడ్రోస్..పలుమార్లు ఇథియోపియా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇథియోపియాలోని ఉత్తర ప్రాంతంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణతో అట్టుడుకుతోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం(Border Dispute) కారణంగా హింస ప్రజ్వరిల్లుతోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఈ ఘర్షణలో ఇథియోపియా పాత్రపై టెడ్రోస్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. ‘‘ఆ ఒప్పందం ఆశించిన ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది ఉన్మాదం సమసిపోవాలని ఆశిస్తున్నా. ఇది నాకు కష్ట సమయం’’ అని మీడియా ప్రతినిధుల ముందు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-15T23:37:22+05:30 IST