ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

China: చైనాలో పరిస్థితి మరీ ఇలానా.. షాకింగ్ వీడియో..

ABN, First Publish Date - 2022-12-04T16:27:56+05:30

ప్రభుత్వ కరోనా కట్టడి చర్యల కారణంగా చైనాలో క్షేత్రస్థాయి పరిస్థితి ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కరోనా(Corona Virus) పుట్టి మూడేళ్లు దాటింది. అనేక దేశాలు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నాయి. కానీ.. చైనా(China) మాత్రం కరోనా పేరు చెబితే గజగజా వణికిపోతోంది. వదల బొమ్మాళీ అంటూ పట్టి పీడిస్తున్న కరోనాను వదిలించుకునేందుకు జీరో కోవిడ్ పాలసీ(Zero Covid Policy) పేరుతో కఠిన చర్యలకు పూనుకుంటోంది. చైనాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది(Viral Video).

వీడియోలో కొందరు చైనా వైద్య సిబ్బంది..ఓ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అయితే..క్వారంటైన్‌కు రానని చెప్పడంతో వాళ్లు బలవంతంగా అతడిని తరలించారు. కాళ్లు చేతులూ పట్టుకుని అతడిని ఈడ్చుకెళతారు(Dragged to quarantine). నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఇప్పటికే దీనికి నాలుగు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. చైనాలో ఇలాంటి సీన్స్ సాధారణమే అంటూ అనేక మంది కామెంట్స్ చేశారు. కానీ కొందరు మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. తనంతట తానుగా అతడు క్వారంటైన్ కేంద్రానికి వెళ్లి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

అసలేమిటీ జీరో కోవిడ్ పాలసీ..

ఒక్క ముక్కలో చెప్పాలంటే కరోనా వ్యాప్తిని మొగ్గలో తుంచేయడమే జీరో కోవిడ్ పాలసీ. ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డాడని తెలియగానే అతడిని క్వారంటైన్‌కు తరలిస్తారు. అంతేకాకుండా.. అంతకుమునుపు ఆ వ్యక్తిని కలిసిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. దీన్నే కాంటాక్ట్ ట్రేసింగ్ అని అంటారు. కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశల్లోనే అరికట్టడం ఈ వ్యూహం ప్రధాన లక్ష్యం. మూడేళ్ల క్రితం కరోనా సంక్షోభం మొదలైనప్పుడు.. వ్యాప్తి సామర్థ్యం తక్కువగా ఉన్న స్ట్రెయిన్‌లు ఉనికిలో ఉండేవి. దానికి తగ్గట్టుగా.. వైద్య నిపుణులు జీరో కోవిడ్ పాలసీని సూచించారు. అప్పటి పరిస్థితులకు జీరో కోవిడ్ పాలసీ సరైనదనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమైంది. అయితే.. వేగంగా వ్యాపించగలిగిన కొత్త స్ట్రెయిన్లు ఉనికిలోకి వచ్చాక పరిస్థితి మారింది. ప్రస్తుత స్థితిలో జీరో కోవిడ్ పాలసీ ఆచరణాత్మకమైన విధానం కాదనేది అత్యధికుల అభిప్రాయం. దీనికి ప్రత్యామ్నాయంగా.. విస్తృత టీకాకరణతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు కృషి చేయాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా..మరో కరోనా వేవ్‌ను నివారించడం లేదా, దాని తీవ్రత తగ్గించడం సాధ్యపడుతుందని అంటున్నారు.

Updated Date - 2022-12-04T16:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising