ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంపై భారత సంతతి ముద్ర!

ABN, First Publish Date - 2022-10-26T04:35:11+05:30

బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టడంతో భారత సంతతి వ్యక్తులు పాలనపరంగా అత్యంత కీలక పదవిని చేపట్టిన దేశాల్లో యూకే కూడా చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు దేశాల్లో కీలక పదవుల్లో భారత మూలాలున్న వ్యక్తులు

న్యూఢిల్లీ, అక్టోబరు 25: బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టడంతో భారత సంతతి వ్యక్తులు పాలనపరంగా అత్యంత కీలక పదవిని చేపట్టిన దేశాల్లో యూకే కూడా చేరింది. ఇది కాక ఇప్పటికే మరో ఐదు దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు తమ నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నారు. అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నికై ఆమె సంచలనం సృష్టించారు. మారిషస్‌ దేశంలో అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌, ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ భారత మూలాలున్న హిందూకుటుంబానికి చెందినవారు. గయానా దేశ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ తల్లిదండ్రుల్లో ఒకరిది గయానా కాగా మరొకరిది భారత్‌. సురినామ్‌కు అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి చంద్రిక ప్రసాద్‌ సంతోఖి విధులు నిర్వర్తిస్తున్నారు. పోర్చు గీసు ప్రస్తుత ప్రధాని ఆంటోనియో కోస్టా తాత గోవాలో జన్మించారు.

Updated Date - 2022-10-26T04:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising