ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Australia: హాయ్ అమ్మా.. అంటూ వాట్సాప్‌లో మెసేజ్.. రిప్లై ఇచ్చినోళ్ల పరిస్థితి ఏమైందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-12-13T20:44:28+05:30

హై మమ్ మెసేజీలతో ఆస్ట్రేలియాలో భారీ స్కామ్.. వేల సంఖ్యలో బాధితులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ‘‘హాయ్ అమ్మా.. ఎలా ఉన్నావ్.. ఇది నా కొత్త నెంబర్.. సేవ్ చేసుకో.. నేనిప్పుడు ఓ సమస్యలో చిక్కుకున్నాను.. కాస్తంత డబ్బు సర్దగలవా..’’

‘‘హాయ్ డాడీ.. నేను ఆన్‌లైన్‌లో ఓ వస్తువు కొన్నాను.. కానీ..టెక్నికల్ సమస్య వల్ల డబ్బు చెల్లించడం కుదరట్లేదు.. ఈ అకౌంట్‌కు డబ్బు పంపిస్తే అప్పుడు నేను షాపింగ్ పూర్తి చేస్తా..’’

ఈ మెసేజీలు(Text Message) చూస్తే..నిజంగా ఎవరి సంతానమో పంపించినట్టు ఉంది కదూ.. మనమే కాదు.. ఆస్ట్రేలియన్లు(Australians) కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నారు. తమ కొడుకో కూతురో మెసేజ్ పంపించారనుకున్నారు. తమ సంతానానికి డబ్బు సాయం చేస్తున్నామనుకుని.. సైబర్ నేరగాళ్లకు వందల కోట్లు సమర్పించుకున్నారు. ‘‘హై మమ్’’(Hi Mum) స్కామ్‌గా(Scam) పేరుపడ్డ ఈ మోసానికి వేల సంఖ్యలో ప్రజలు బలైపోయారు. ఇలాంటి మెసేజీలతో నేరగాళ్లు ఈ ఏడాది ఏకంగా 7.2 మిలియన్ డాలర్లు దోచుకుపోయారు. వీరి ఆగడాలకు ఏకంగా 11 వేల మంది ఆస్ట్రేలియన్లు బాధితులుగా మిగిలిపోయారు. దీంతో..ఆస్ట్రేలియా వినియోగదారుల హక్కుల పరిరక్షణ విభాగం తాజాగా ట్విటర్‌‌లో ప్రజలను హెచ్చరించింది. బంధువులు, స్నేహితులమని చెప్పుకుంటూ సైబర్ నేరగాళ్లు పంపించే మెసేజీల బారినపడొద్దని సూచించింది. ఈ తరహా సందేశాలకు స్పందించే ముందు ఒకటికి రెండు సార్లు అన్నీ సరి చూసుకోవాలని చెప్పింది.

Updated Date - 2022-12-13T20:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising