ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తవృద్ధి కోసం...

ABN, First Publish Date - 2022-07-19T18:24:10+05:30

వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేలా శరీరాన్ని నీరసింపజేసే సమస్య...‘రక్తహీనత’! తీవ్రమైన ఇబ్బందులు కలిగించకపోయినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేలా శరీరాన్ని నీరసింపజేసే సమస్య...‘రక్తహీనత’! తీవ్రమైన ఇబ్బందులు కలిగించకపోయినా, జీవన నాణ్యతను కుంగదీయగలదు. కాబట్టి రక్తం తగ్గకుండా ఆహారపుటలవాట్లు అలవరుచుకోవాలి!


తగినంత రక్తం ఉన్నప్పుడే శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా జరిగి జీవక్రియలు చురుగ్గా, సజావుగా సాగుతూ ఉంటాయి. శక్తి సక్రమంగా కొనసాగుతుంది. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే తింటున్న ఆహారంలో ఐరన్‌ తగుమాత్రంగా ఉంటుందో లేదో గమనించుకోవాలి. కానీ ఎక్కువ శాతం మంది ఆహారం ఆకలి తీర్చేలా ఉంటే చాలనుకుంటారు. దాన్లో రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము ఉందో, లేదో తెలుసుకోరు. ఏ పదార్థాల్లో ఐరన్‌ ఎక్కువ ఉంటుందనే అవగాహనా ఉండదు. ఫలితంగా అనీమియా బారిన పడుతూ ఉంటారు. ఈ సమస్య తీవ్రమైన లక్షణాలను బయల్పరచదు. ఆ లక్షణాలు కూడా అత్యంత సాధారమైనవిగా కనిపిస్తాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే....


  • నీరసం, నిస్సత్తువ
  • కళ్ల ముందు చీకట్లు ఆవరించడం
  • కళ్లు తిరగడం
  • గుండె దడ, ఆయాసం  
  • చిరాకు
  • మానసిక కుంగుబాటు 
  • అతి నిద్ర లేదా నిద్ర పట్టకపోవడం
  • జుట్టు రాలిపోవడం 
  • నోటి పూతకాళ్లు, చేతులలో తిమ్మిర్లు
  • కండరాలు అదరడం


విరుగుడు ఇలా...

  • ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి.
  • అంజీర్‌, గోంగూర, బచ్చలి కూర ఎక్కువగా తినాలి
  • జీడిపప్పు, బాదం తింటూ ఉండాలి.
  • పొట్టు తీయని ధాన్యం, రాగులు, సజ్జలు ఆహారంలో చేర్చుకోవాలి.

Updated Date - 2022-07-19T18:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising