ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరుకుల పరుగుల జీవితంలో.. మనసు ప్రశాంతంగా ఉండాలంటే!

ABN, First Publish Date - 2022-02-08T18:33:59+05:30

ఉదయం లేచినప్పటినుంచి కెరీర్‌కోసం ఉరుకుల పరుగులే. దీని వల్ల ఒత్తిడి సహజంగానే కలుగుతుంది. అయితే శరీరానికి వ్యాయామంతో పాటు మనసుకూ ప్రశాంతత ఉండటంతో పాటు ఒత్తిడి చిత్తవ్వాలంటే యోగా తప్పనిసరి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(08-02-2022)

ఉదయం లేచినప్పటినుంచి కెరీర్‌కోసం ఉరుకుల పరుగులే. దీని వల్ల ఒత్తిడి సహజంగానే కలుగుతుంది. అయితే శరీరానికి వ్యాయామంతో పాటు మనసుకూ ప్రశాంతత ఉండటంతో పాటు ఒత్తిడి చిత్తవ్వాలంటే యోగా తప్పనిసరి. 


ఆనంద బాలాసనం

మనసుకు, శరీరానికి సాంత్వన చేకూర్చే ఆసనం ఇది. పిరుదులు, వెన్ను, కటి విశాలపరిచే ఆసనం కూడా ఇదే. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

వెల్లకిలా పడుకుని కాళ్లు మడవాలి. రెండు కాళ్లూ పైకి లేపి, పాదాల వేళ్లను రెండు చేతులతో పట్టుకోవాలి. కాళ్లను మరింతగా ఛాతీవైపు లాగి, వెడల్పు చేయాలి. ఈ భంగిమలో వెన్ను చదునుగా ఉంచాలి. ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.



బాలాసనం

ఈ ఆసనం యోగాభ్యాసంలో అత్యంత అవసరం. వెన్ను, పిరుదులు, తొడలు, కాలి గిలకలకు వ్యాయామాన్ని అందించే ఈ ఆసనంతో ఒత్తిడి, ఆందోళనలు అదుపులోకి వస్తాయి. ఈ ఆసనం ఎలా వేయాలంటే....

మోకాళ్లు, కాలి గిలకల ఆధారంగా కూర్చోవాలి. నుదురు నేలకు తగిలేలా ముందుకు వంగాలి. చేతులు తల మీదుగా శరీరానికి సమాంతరంగా చాపి ఉంచవచ్చు లేదా శరీరం పక్కగా చాపుకోవచ్చు. ఊపిరి మీద ధ్యాస ఉంచి, ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి.


భుజంగాసనం

పొట్టమీద బోర్లాపడుకోవాలి.  పక్కటెముకల దగ్గర చేతులను నేలమీద ఆనించి ఉంచాలి. చేతులు ఆసరాగా నడుము పైభాగాన్ని పైకి లేపాలి.

ఈ భంగిమలో చూపు పైకి ఉండాలి.  ప్రయోజనం- వెన్ను కండరాల అలసట తొలగిపోయి.. వెన్నుకు రెండు వైపులా ఉండే కండరాలు బలపడతాయి. భుజాల కింది ప్రదేశం, ఛాతీ-నడుము మధ్య ఉండే ప్రదేశం, కాళ్లు బలపడతాయి. కంఠం, ఛాతి, భుజాలు వ్యాకోచిస్తాయి.

Updated Date - 2022-02-08T18:33:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising