ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్ర పట్టడం లేదు.. మంచి నిద్ర కోసం ఏం చేయాలి?

ABN, First Publish Date - 2022-06-04T21:03:32+05:30

నాకు యాభైఏళ్లు. తెల్లవారక ముందే మెలకువొస్తోంది. మళ్ళీ నిద్ర పట్టడం లేదు. మంచి నిద్ర కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-06-2022)

ప్రశ్న: నాకు యాభైఏళ్లు. తెల్లవారక ముందే మెలకువొస్తోంది. మళ్ళీ నిద్ర పట్టడం లేదు. మంచి నిద్ర కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- ప్రియ, చిత్తూరు


డాక్టర్ సమాధానం: వయసు పెరిగేకొద్దీ, ముఖ్యంగా మధ్యవయసు దాటిన తరువాత నిద్ర కొంత తగ్గుతుంది. వెంటనే నిద్ర పట్టకపోవడం, కొద్ది సేపటికే మెలకువ రావడం లేదా రాత్రి తరచూ మెలకువ రావడం, తిరిగి నిద్ర పట్టకపోవడం లాంటి ఇబ్బందులు వయసు పెరిగే కొద్దీ వచ్చే అవకాశం ఎక్కువ. సరిగా నిద్ర పట్టడంలో ఆహారం పాత్ర కొంత ఉంటుంది. నిద్రపట్టేందుకు అవసరమైన మెలటోనిన్‌ అనే హార్మోను ఉత్పత్తికి సహకరించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను కొంత ఎదుర్కోవచ్చు. పడుకునే అరగంట ముందు గోరువెచ్చని పాలు, మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావ, అరటి, కివి పండు, బాదం లేదా జీడిపప్పు మొదలైనవి తీసుకొంటే నిద్ర పడుతుందని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అలాగే, రాత్రి భోజనంలో రొట్టెలకు బదులుగా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఆందోళన అధికంగా ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌ అనే హార్మోను కూడా నిద్రలేమికి కారణమే. కాబట్టి యోగ, ప్రాణాయామం మొదలైనవి చేయడం మంచిది. రోజూ కొంత శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే నిద్ర లేమి సమస్య దూరమవుతుంది. నిద్రకు కనీసం గంట ముందుగానే టీవీ, ఫోన్‌ లాంటి ఎలకా్ట్రనిక్‌ పరికరాలను చూడడం మానేస్తే కళ్ళకు విశ్రాంతి లభించి మెలటోనిన్‌ ఉత్పత్తి మెరుగవుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-04T21:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising