ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమపిండి మంచిదా? లేక మల్టీగ్రెయిన్ పిండి మంచిదా?

ABN, First Publish Date - 2022-02-09T18:24:25+05:30

గోధుమపిండిని గోధుమల నుంచి తయారు చేస్తారు. మల్టీగ్రెయిన్ పిండిలో రకరకాల ధాన్యాలు ఉంటాయి. మార్కెట్లో లభించే వాటిలో ధాన్యాలు, పప్పులు, కొంత పీచుపదార్థం ఉంటున్నాయి. కొంత మంది ఇంటి వద్దే కొన్ని రకాల చిరుధాన్యలు, పప్పులు, గింజలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(09-02-2022)

ప్రశ్న: గోధుమపిండి, మల్టీగ్రెయిన్ పిండి ఈ రెంటిలో ఏది మంచిది? అన్ని వయసుల వారూ తినొచ్చా?


-రామచంద్రారావు, హన్మకొండ


డాక్టర్ సమాధానం: గోధుమపిండిని గోధుమల నుంచి తయారు చేస్తారు. మల్టీగ్రెయిన్ పిండిలో రకరకాల ధాన్యాలు ఉంటాయి. మార్కెట్లో లభించే వాటిలో ధాన్యాలు, పప్పులు, కొంత పీచుపదార్థం ఉంటున్నాయి. కొంత మంది ఇంటి వద్దే కొన్ని రకాల చిరుధాన్యలు, పప్పులు, గింజలతో ఈ మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకుంటున్నారు కూడా. మామూలు గోధుమపిండితో పోలిస్తే మల్టీగ్రెయిన్ పిండిలో వాడిన ధాన్యాలు, పప్పుల్ని బట్టి పోషక విలువల్లో తేడాలుంటాయి. సోయా, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో చేసిన పిండిలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, కొన్ని ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఆక్రోట్, బాదం, అవిసెగింజల్ని కూడా వాటిలో కలిపి ఉన్నట్టయితే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మల్టీగ్రెయిన్ పిండిలో లభిస్తాయి. మల్టీగ్రెయిన్ పిండిని కూడా గోధుమపిండిలానే సాధారణ ఆరోగ్యవంతులు, అన్ని వయసుల వారూ రోజూ తీసుకోవచ్చు. బరువు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలంటే మాత్రం పరిమాణాన్ని మించి ఏది తీసుకున్నా ఇబ్బందే. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-09T18:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising