ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా వేసుకుంటేనే... రంగు పడుద్ది!

ABN, First Publish Date - 2022-09-21T18:29:33+05:30

ఒకప్పుడు తెల్ల జుట్టు ఉన్నవారు మాత్రమే రంగు వేసుకొనేవారు. కానీ ఈ మధ్యకాలంలో జుట్టుకు రకరకాల రంగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పుడు తెల్ల జుట్టు ఉన్నవారు మాత్రమే రంగు వేసుకొనేవారు. కానీ ఈ మధ్యకాలంలో జుట్టుకు రకరకాల రంగులు వేసుకోవటం ఒక ఫ్యాషన్‌గా మారింది. జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు అది ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..


72 గంటల తర్వాతే..

చాలా మంది జుట్టుకు రంగు వేసుకున్న వెంటనే షాంపు పెట్టి రుద్దేస్తారు. దీని వల్ల జుట్టు రంగు ఎక్కువ కాలం ఉండదు. రంగు వేసుకున్న 72 గంటల దాకా షాంపుతో రుద్దకపోవటం మంచిది. దీని వల్ల రంగు ఎక్కువ కాలం ఉంటుంది. రంగు వేసుకున్న తొలిరోజు కండిషనర్‌తోనే జుట్టును శుభ్రం చేసుకోవటం మంచిది.


ఎలాంటి షాంపు అంటే..

మార్కెట్లో కలర్‌ ప్రొటక్షన్‌ షాంపులు లభ్యమవుతాయి. వాటిని వాడితే జుట్టు రంగు ఎక్కువ కాలం ఉంటుంది. సాధారణం షాంపులతో తలంటుకుంటే రంగు ఎక్కువ కాలం ఉండదు. అంతే కాకుండా ప్రతి రోజు షాంపుతో స్నానం చేయటం వల్ల కూడా జుట్టు రంగు త్వరగా పోతుంది. 


కండిషనర్‌ తప్పనిసరి..

జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత కండిషనర్‌ను తప్పనిసరిగా పెట్టాలి. జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు - వెంట్రుకలలో ఉన్న తేమ త్వరగా పోతుంది. కండిషనర్‌ పెడితే ఈ తేమ మళ్లీ తిరిగి వస్తుంది. అందువల్ల కండిషనర్‌ తప్పనిసరి. వారానికి కనీసం ఒక సారైనా జుట్టుకు నూనె పెడితే మంచి ఫలితాలు ఉంటాయి. దీని వల్ల పోయిన తేమ తిరిగి వస్తుంది. 


ఎక్కువ వేడి..

రంగు వేసిన జుట్టును ఎక్కువ వేడి ఉన్న డ్రైయర్‌ ద్వారా ఆరబెట్టకూడదు. వేడి గాలి వల్ల జట్టు పాడయిపోతుంది. అంతే కాకుండా జుట్టుకు వేసిన రంగు కూడా త్వరగా పోతుంది.

Updated Date - 2022-09-21T18:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising