ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్ణయం తీసుకొనే ముందు..

ABN, First Publish Date - 2022-07-14T16:53:54+05:30

ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో రకరకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని సార్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో రకరకాల ఆలోచనలు చుట్టుముడతాయి. భయం వేస్తుంది. ఈ పరిస్థితినే మానసిక నిపుణులు ‘కేస్ట్రోఫిసింగ్‌’ అంటారు. దీని నుంచి బయటకు రావటానికి వారు కొన్ని మార్గాలు సూచిస్తున్నారు...


వాయిదా వేయండి...

మనం నిద్రపోయినప్పుడు మెదడులో హేతుబద్ధమైన ఆలోచనలకు కారణమైన భాగాలు తక్కువగా, భావోద్వేగాలను పెంచే భాగాలు చురుకుగా పనిచేస్తాయి. అందువల్ల రాత్రిళ్లు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ సమయంలో తీసుకొనే నిర్ణయాలు మన భావోద్వేగాలపై ఆధారపడి ఉంటాయి. ప్రశాంతంగా నిద్రపోయి లేచిన తర్వాత తీసుకొనే నిర్ణయాలు హేతుబద్ధంగా ఉంటాయి.


ఇతరుల ఆలోచనలు కూడా... 

కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో- ‘‘ఇవే పరిస్థితులు ఎదురయితే ఇతరులు ఎలా ఆలోచిస్తారు?’’ అని ఆలోచించాలి. దీనివల్ల మనకు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశముంది. మనవైపు నుంచి మాత్రమే ఆలోచిస్తే కొత్త ఆలోచనలు రావు. 


భయాన్ని దరిచేరనివ్వకండి... 

గతంలో జరిగిన సంఘటనల తాలూకు ప్రభావం మనపై ఉంటుంది. కానీ అవే తరహా సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. భవిష్యత్తులో చెడు జరుగుతుందనే భయం మనిషిని వెంటాడుతూ ఉంటే హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది. అందువల్ల వీలైనంత వరకూ ఆ భయాన్ని తగ్గించుకోవాలి. 

Updated Date - 2022-07-14T16:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising