ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలు తగిన ఎత్తు పెరగడానికి ఏం చేయాలి?

ABN, First Publish Date - 2022-03-21T17:06:01+05:30

ఎత్తు పెరగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీన్స్‌ పాత్ర 60 నుంచి 80 శాతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-03-2022)

ఎత్తు పెరగడం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. జీన్స్‌ పాత్ర 60 నుంచి 80 శాతం వరకు ఉంటే మిగతా 40 నుంచి 20 శాతం వరకు మన చేతుల్లోనే ఉంటుంది. పిల్లలు తగిన ఎత్తు పెరిగేందుకు ఏం చేయాలంటే....


పిల్లల శారీరక ఎదుగుదలకు సమతుల ఆహారం అవసరం. విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. ఎముకలు బలోపేతం అయితే ఎత్తు బాగా పెరుగుతారు. ఎముకల బలోపేతానికి క్యాల్షియం, విటమిన్‌ డి అవసరం. వ్యాయామం వల్ల అనేక  ప్రయోజనాలు చేకూరతాయి. అందులో ఎత్తు పెరగడం కూడా ఒకటి. వ్యామామం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. పిల్లల్లో తగిన శారీరక వ్యాయామం ఉంటే మంచి ఎదుగుదల కూడా ఉంటుంది. యోగా, రోప్‌ జంపింగ్‌ వంటివి కూడా ఎత్తు పెరిగేందుకు దోహదపడతాయి.  


 భుజాలు, మెడ వంచడం, వెన్ను వంచి నడవడం వంటివి కూడా ఎత్తు తక్కువ కనిపించేలా చేస్తాయి. ఒకవేళ పిల్లల భంగిమ సరిగ్గా లేకపోతే దాన్ని గుర్తించి సరిచేసే ప్రయత్నం చేయాలి. పిల్లలు ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ముందు ఉన్నప్పుడు సరైన భంగిమలో కూర్చునేలా చూడాలి. పిల్లలు యుక్తవయస్సుకు వచ్చిన తరువాత కూడా బాగా నిద్రపోయేలా చూడాలి. నిద్రలో శరీరం హ్యూమన్‌ గ్రోత్‌ హార్మోన్‌(హెచ్‌జీహెచ్‌)ను విడుదల చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే ఈ హార్మోన్‌ విడుదల తగ్గిపోతుంది. అది పిల్లల ఎదుగదలపైన ప్రభావం చూపిస్తుంది. మంచి పోషకాహారం అందించినా కొందరు పిల్లలు తగినంత ఎత్తు పెరగలేకపోతారు. కొన్నిసార్లు ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సలహా మేరకు సప్లిమెంట్లు ఇవ్వాలి. 

Updated Date - 2022-03-21T17:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising