ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొటిమల నుంచి విముక్తి కలగాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించండి!

ABN, First Publish Date - 2022-02-23T17:24:32+05:30

అమ్మాయిలు ముఖం మీద మొటిమ కనపడితే గిల్లేసి సమస్యను మరింత పెద్దది చేస్తుంటారు. అలా చేయకుండా.. మొటిమల నుంచి విముక్తి కలగాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించాలి!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రజ్యోతి(23-02-2022)

అమ్మాయిలు ముఖం మీద మొటిమ కనపడితే గిల్లేసి సమస్యను మరింత పెద్దది చేస్తుంటారు. అలా చేయకుండా.. మొటిమల నుంచి విముక్తి కలగాలంటే ఈ ఇంటి చిట్కాలు పాటించాలి! 


అలొవెరా జెల్‌ను ముఖానికి పూయాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలొవెరాలో శాలిసిలిక్‌, సినామొనిక్‌ ఆమ్లాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. తరచూ అలొవెరా జెల్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలాచేయడం వల్ల నొప్పులు, మంట సమస్యలు తగ్గిపోతాయి.  


నిమ్మరసాన్ని ఒక బౌల్‌లో తీసుకుని ముఖానికి పట్టించుకోవాలి. సిట్రిక్‌ ఆమ్లం ముఖంమీద కాస్త మంటగా అనిపించినా ఫర్లేదు. ఇలా తరచుగా చేస్తుంటే.. మొటిమలతో పాటు నల్లమచ్చలు తగ్గిపోతాయి.


పుదీనా ఆకుల్ని దంచి ఆ రసాన్ని గులాబీ నీళ్లలో కలిపి ముఖానికి పట్టించుకోవాలి. పుదీనాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేషనరీ గుణాలవల్ల మొటిమలు తగ్గిపోతాయి. ఇందులోని శాలిసిలిక్‌ యాసిడ్‌ వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మొటిమలల్లోని చెడుపదార్థం తొలగిపోతుంది. 


కొత్తిమీర రసంలోకి టేబుల్‌ స్పూన్‌ పసుపు వేసి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. తరచుగా  ఇలా చేయడం వల్ల  మొటిమలు మటుమాయం అవుతాయి.

Updated Date - 2022-02-23T17:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising