ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరీ ఎక్కువ వేడిగా, చల్లగా ఉండే పదార్థాలను తినడం వల్ల..?

ABN, First Publish Date - 2022-01-28T18:55:03+05:30

దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికీ గుండె ఆరోగ్యానికీ దగ్గరి సంబంధం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండి, చక్కర, పిండి పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారం దంతాలకూ మంచిదే. టానిన్స్‌ ఉండే ఆహార పదార్థ్ధాలైన టీ, కాఫీ, కూల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-01-2022)

ప్రశ్న: చిగుళ్లు, దంత సంరక్షణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- వైభవ్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికీ గుండె ఆరోగ్యానికీ దగ్గరి సంబంధం ఉందని పరిశోధనలు తెలుపుతున్నాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండి, చక్కర, పిండి పదార్ధాలు తక్కువగా ఉండే ఆహారం దంతాలకూ మంచిదే. టానిన్స్‌ ఉండే ఆహార పదార్థ్ధాలైన టీ, కాఫీ, కూల్‌ డ్రింకులు, వైన్‌ మొదలైనవి తీసుకోవడం; పొగతాగడం, పాన్‌, గుట్కా లాంటివి నమలడం; దంతాలను సరిగా శుభ్రం చేసుకోక పోవడం; ఆహారం లేదా నీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉండడం లాంటి వాటితో పాటు కొన్ని రకాల అనారోగ్యాలు దంతాలు పసుపు పచ్చగా ఉండేందుకు కారణాలు. అయితే వయసు పెరగడంతో పళ్ళపై ఉండే ఎనామెల్‌ తగ్గడం వల్ల కూడా పళ్ళు రంగు మారతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల పదార్థాలు తప్పని సరి. పీచుపదార్థాలు ఉండే కూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. దంతాల ఎనామెల్‌కు నష్టం కలిగించే పుల్లటి పదార్థాలు తగ్గించాలి. ఫాస్ఫరస్‌ అధికంగా ఉండే కూల్‌ డ్రింకులకు దూరంగా ఉండాలి. అత్యంత వేడి, అత్యంత చల్లదనం ఉండే పదార్ధాలను నివారించాలి. ఏదైనా ఆహారం తీసుకున్న తరువాత నోటిని నీటితో పుక్కిలించడంతో పాటు, తప్పని సరిగా రోజుకు రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 


Updated Date - 2022-01-28T18:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising