ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు రాలే సమస్యకు ఇలా చెక్‌ పెట్టొచ్చు..

ABN, First Publish Date - 2022-02-16T17:29:13+05:30

బాదం, జీడిపప్పు, పిస్తాల్లో పోషకాలు పుష్కలం. రోజూ వీటిని గుప్పెడు తింటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్యకరమైన స్నాక్స్‌ స్థానంలో వీటిని చేర్చడం ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-02-2022)

బాదం, జీడిపప్పు, పిస్తాల్లో పోషకాలు పుష్కలం. రోజూ వీటిని గుప్పెడు తింటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్యకరమైన స్నాక్స్‌ స్థానంలో వీటిని చేర్చడం ద్వారా జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. 


సీడ్స్‌లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. చియా విత్తనాలు, అవిసెలలో జుట్టు ఆరోగ్యానికి పనికొచ్చే ఒమెగా -3 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. వీటిని స్మూతీ, సలాడ్స్‌ రూపంలో తీసుకోవాలి.

 

శనగలు, కిడ్నీ బీన్స్‌, బ్లాక్‌ బీన్స్‌ వంటి వాటిలో ప్లాంట్‌ బేస్డ్‌ ప్రోటీన్‌ లభిస్తుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. వీటిని మెనూలో ఏదో ఒక రూపంలో ఉండేలా చూసుకోవాలి. 

 

పాలకూరలో ఫొలేట్‌, ఐరన్‌, విటమిన్‌ ఎ, సి లభిస్తాయి. వారంలో మూడు రోజులు మెనూలో పాలకూర ఉండేలా చూసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.

 

ఉసిరిలో సి-విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఆహారంలోని ఐరన్‌ను గ్రహించడంతో పాటు, జుట్టు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.


చిలగడదుంపల్లో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఎ-విటమిన్‌ తయారీకి ఇది సహాయపడుతుంది. ఎ-విటమిన్‌ సెబమ్‌ తయారీలో సహాయపడుతుంది. సెబమ్‌ జుట్టును మృదువుగా తయారుచేస్తుంది. పొడిబారకుండా చూస్తుంది. 


ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ చేపల్లో అధికంగా లభిస్తాయి. అందులోనూ సాల్మన్‌ చేపను తీసుకుంటే జుట్టు పెరుగుదల వేగంగా జరిగేందుకు సహాయపడుతుంది.


శరీరంలో రక్తప్రసరణను పెంచడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ అందేలా చేయడానికి ఇది అవసరం. 

Updated Date - 2022-02-16T17:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising