ధూమపానం అలవాటు మానుకున్నా.. ఊపిరితిత్తుల్లో ఉండిపోయే వీటిని తొలగించాలంటే..
ABN, First Publish Date - 2022-04-21T19:28:26+05:30
ధూమపానం తాలూకు నికోటిన్ ఊపిరితిత్తుల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఈ అలవాటును మానుకున్నా, ఎన్నో నెలల తరబడి టాక్సిన్లు ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతూ ఉంటాయి.
ఆంధ్రజ్యోతి(20-04-2022)
ధూమపానం తాలూకు నికోటిన్ ఊపిరితిత్తుల్లో పేరుకుపోతూ ఉంటుంది. ఈ అలవాటును మానుకున్నా, ఎన్నో నెలల తరబడి టాక్సిన్లు ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతూ ఉంటాయి. వాటిని బయటకు తెప్పించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
నీళ్లు: వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నిమ్మరసం లేదా కామోమిల్, గ్రీన్ టీలు కూడా ఊపిరితిత్తుల్లోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోడానికి సహాయపడతాయి.
పోషకాలు, పీచు: మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పీచు, సరిపడా పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఇవి వద్దు: మద్యం, కాఫీ, టీ, శీతల పానీయాలు మానుకోవాలి.
వ్యాయామం: కార్డియో వ్యాయామాలతో ఊపిరితిత్తులు బలపడతాయి. ఫలితంగా టాక్సిన్లు వేగంగా శరీరం నుంచి వెళ్లిపోతాయి.
ధూమపానం: టాక్సిన్లను సమూలంగా శరీరం నుంచి తొలగించాలంటే ధూమపానానికి శాశ్వతంగా దూరమవ్వాలి. ఈ అలవాటును మానుకోవడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి.
Updated Date - 2022-04-21T19:28:26+05:30 IST