ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా స్క్రబ్‌ చేసుకోవాలి..

ABN, First Publish Date - 2022-09-14T20:33:15+05:30

కొందరు ఎక్కువ సమయం ముఖం కడగకుండా ఉంచితే బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యమైన చర్మం కావాలంటే స్క్రబ్‌ చేయటం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు ఎక్కువ సమయం ముఖం కడగకుండా ఉంచితే బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యమైన చర్మం కావాలంటే స్క్రబ్‌ చేయటం, ఎలాంటి పదార్థాలతో స్క్రబ్‌ చేసుకోవాలో తెలుసుకోవాలి. పొరపాట్లు చేయకూడదు. అప్పుడే అందం రెట్టింపవుతుంది.


స్క్రబ్‌ చేయడం అంటే ఏదో తంతుగా చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ముఖంపై నొప్పులు, ఎర్రగా కమలడం, దద్దుర్లు, మంట ఉత్పన్నమవుతాయి. వాల్‌నట్‌షెల్‌, మార్కెట్‌లో దొరికే గరుకు స్క్రబ్బర్స్‌ వాడితే చర్మంలో సున్నితత్వం పోతుంది. ఎరుపెక్కుతుంది. అందుకే మొక్కలు, విత్తనాల స్క్రబ్బర్స్‌ వాడాలి. దానిమ్మ విత్తనాల పొడి, బొప్పాయి, నిమ్మ లేదా నారింజ తొక్కల పొడి, అలొవెరా.. లాంటి సహజమైన స్క్రబ్బర్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి మైల్డ్‌గా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి హాని జరగకపోగా శుభ్రం అవుతుంది. పారాబిన్స్‌, సల్ఫేట్స్‌ లేని స్క్రబర్స్‌కే ఓటేయాలి. 


ఈ జాగ్రత్త అవసరం.. 

ముఖానికి స్క్రబ్బింగ్‌ చేస్తున్న సమయంలో వేళ్ల కదలిక పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏదో అలా స్క్రబ్‌ చేశామని... హడావుడి చేస్తే ఉపయోగం లేదు. దీనివల్ల మనకు తెలీకుండా ముఖంపై గాట్లు పడతాయి. అందుకే మృదువుగా నుదురు నుంచి మెల్లగా మెడవరకు మసాజ్‌ చేసుకోవాలి. అప్పుడు మృతకణాలు తొలగిపోయి. ఫ్రెష్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. చెవులకు కూడా కఠినమైన స్క్రబర్స్‌ను పొరబాటున కూడా వాడొద్దు. 


చర్మ తత్వాన్ని బట్టి... 

స్క్రబ్బర్‌ గట్టిగా, కఠినంగా ఉంటేనే ఏదో స్క్రబింగ్‌ చేశామనే ఫీలింగ్‌ కలిగితే అది తాత్కాలికమే. ముఖ్యంగా ఆయిల్‌ స్కిన్‌కి జెల్లీ స్క్రబర్‌ను వాడాలి. పొడి చర్మానికి క్రీమ్‌ స్క్రబర్‌ ఉండాలి. స్క్రబ్బింగ్‌ అయిపోయాక వెంటనే మాయిశ్చరైజర్‌ లేదా ఫేస్‌ క్రీమ్స్‌ రాసుకోవాలి. దీనివల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. చర్మంలో కాంతి వస్తుంది. మొత్తానికి స్క్రబ్బర్‌ అనేది తక్కువ మోతాదులో వాడితేనే మంచిది.

Updated Date - 2022-09-14T20:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising