ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించాలంటే..!

ABN, First Publish Date - 2022-02-21T17:24:58+05:30

ముఖంపై ముడతలు కనిపిస్తే ఆందోళన చెందడం సహజమే. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-02-2022)

ముఖంపై ముడతలు కనిపిస్తే ఆందోళన చెందడం సహజమే. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

సన్‌స్ర్కీన్‌ లోషన్‌ తప్పనిసరిగా వాడాలి. చర్మం వయసుపైబడినట్టుగా కనిపించడానికి 90 శాతం యువీ కిరణాలే కారణం. చర్మంలోని సాగేగుణాన్ని యువీకిరణాలు బ్రేక్‌ చేస్తాయి. దీనివల్ల చర్మం నిగారింపు తగ్గిపోయి, ముడతలు వచ్చి చేరతాయి. 

ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. డీహైడ్రేషన్‌ వల్ల చర్మం త్వరగా డల్‌గా మారిపోతుంది. ముడతలు పడిపోతుంది. తగినన్ని నీళ్లు తాగితే చర్మ ఆరోగ్యం బాగుంటుంది.

తగినంత నిద్ర తప్పనిసరి. నిద్ర పోతున్న సమయంలోనే చర్మకణాలు తిరిగి పునరుత్తేజం అవుతాయి. కొత్తవి తయారవుతాయి. 

ఆకుకూరలు ఎక్కువగా తినాలి. తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు ఫ్రీరాడికల్స్‌ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి. 

ఎత్తుకు తగిన బరువు ఉండటం కూడా చాలా ముఖ్యం. యంగ్‌ కనిపించాలంటే ఈ సూత్రం పాటించాల్సిందే. 

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాల వల్ల కణజాల స్థాయిలో ఏజింగ్‌ పదేళ్లు తగ్గుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడయింది.  

ఆల్కహాల్‌, కెఫిన్‌ వాడకం బాగా తగ్గించాలి. ఈ రెండూ శరీరాన్ని డీహైడ్రేట్‌ చేయడమే కాకుండా, ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా చేస్తాయి. 

Updated Date - 2022-02-21T17:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising