వ్యాధులకు దూరంగా... ఆరోగ్యంగా...
ABN, First Publish Date - 2022-09-03T19:53:37+05:30
వానాకాలం(rainy season)లో సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి(Seasonal diseases). ముఖ్యంగా పిల్లల విషయంలో ఆహారం, పరిశుభ్రతకు
వానాకాలం(rainy season)లో సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి(Seasonal diseases). ముఖ్యంగా పిల్లల విషయంలో ఆహారం, పరిశుభ్రతకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఈ వర్షాల్లో మీ చిన్నారుల(Childrens) ఆరోగ్య రక్షణకు వారు ఇస్తున్న సూచనలివి...
- చల్లని వాతావరణం వల్ల పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగరు. దీనివల్ల డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. కనుక దాహం లేకపోయినా నీళ్లు బాగా తాగేలా చూడాలి.
- పిల్లలను వర్షంలో ఆడుకోనివ్వకపోవడమే ఉత్తమం. ఎందుకంటే పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీళ్లు కూడా వీధుల్లో పారుతుంటాయి. వాటిల్లో ఉండే కంటికి కనిపించని బ్యాక్టీరియాలు, వైర్‌సలు అనారోగ్యానికి కారణమవుతాయి.
- ఎంత అడిగినా పిజ్జాలు, బర్గర్లు, కట్ చేసిన పండ్లు, ఛాట్, పానీపూరీ, జ్యూస్‌ల వంటి స్ర్టీట్, జంక్‌ఫుడ్‌కు పిల్లలకు దూరంగా పెట్టాలి. వీటిల్లో వాన నీరు కలిసే అవకాశం ఉంది. పరిశుభ్రత పాటించకపోతే ఎన్నో రకాల క్రిములు పుట్టుకొస్తాయి.
- వర్షాకాలం ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినకపోవడమే మంచిది. ఫ్రిజ్‌లో పెట్టిన నిన్న మొన్నటి ఆహారం అస్సలు ముట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్‌కు స్వస్తి చెప్పి, ఏరోజుకారోజు ఇంట్లోనే వండుకొని తినడం శ్రేయస్కరం.
- అరటి, పైనాపిల్, ఆపిల్, పీచ్, ప్లమ్, చెర్రీ, ఆప్రికట్ వంటి పండ్లు తినిపించడంవల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిల్లోని విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్ మెరుగైన ఆరోగ్యానికి దోహదపడతాయి. పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే సి-విటమిన్ పుష్కలంగా ఉన్న పండ్లు క్రమం తప్పకుండా తినిపించాలి.
Updated Date - 2022-09-03T19:53:37+05:30 IST