ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయి.. అవేంటంటే?

ABN, First Publish Date - 2022-01-24T17:49:06+05:30

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఇవి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(23-01-2022)

ఐదు అలవాట్లు గుండె పోటు ముప్పు నుంచి కాపాడతాయని అంటున్నారు వైద్యనిపుణులు. వీటిని పాటించడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. ఆ సూచనలు ఇవి....


శ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా లభించే ఆలివ్‌ ఆయిల్‌, ఆవనూనె, అవిసెగింజల నూనె వంటి వాటిని తీసుకోవాలి. వీటిమోతాదు నెలకు అర లీటరు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు నట్స్‌, ప్రొటీన్‌ ఫుడ్‌, పీచుపదార్థం అధికంగా లభించే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం వీలైనంత తక్కువ తినాలి. ప్రతిరోజూ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. వారంలో ఐదు సార్లు ఇలా చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని వెల్లడైంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గుతాయి.


ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎక్కువ శాతం గుండె జబ్బులకు స్మోకింగ్‌, ఆల్కహాల్‌ కారణమవుతున్నాయి. ఈ అలవాట్లు లేని వారితో పోలిస్తే అలవాటు ఉన్న వారిలో 50 శాతం రిస్క్‌ ఎక్కువగా ఉంటోంది. కాబట్టి స్మోకింగ్‌, ఆల్కహాల్‌ అలవాటు మానేయాలి. నిద్ర మానసిక ఆరోగ్యానికే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. ఈ అలవాట్లతో పాటు క్రమంతప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. బి.పి, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌, కిడ్నీ, లివర్‌, థైరాయిడ్‌ పనితీరు పరీక్షలు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు, ఈసీజీ వంటి పరీక్షలు చేయించాలి.

Updated Date - 2022-01-24T17:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising