ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిసిఒడి ఉంటే సహజసిద్ధ గర్భధారణ కష్టమా?

ABN, First Publish Date - 2022-03-22T16:47:37+05:30

ఆహార, జీవనశైలి మార్పులతో పిసిఒడిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. వ్యాయామం, సమతులాహారాలు పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ సమస్యను పరిష్కరిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-03-2022)

అపోహ: సహజసిద్ధ గర్భధారణ కష్టం

వాస్తవం: ఆహార, జీవనశైలి మార్పులతో పిసిఒడిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. వ్యాయామం, సమతులాహారాలు పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ సమస్యను పరిష్కరిస్తాయి.


అపోహ: ఈ సమస్య ఉన్నవాళ్లు సోయా తినకూడదు

వాస్తవం: సోయా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను పెంచుతుందనే అపోహ కారణంగా పిసిఒడి ఉన్నవాళ్లు సోయాకు దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఈస్ట్రోజన్‌తో పిసిఒడికీ సంబంధం ఉంది కాబట్టి సోయాకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. నిజానికి సోయాలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఏ మాత్రం ఉండదు. సోయాలో ఫైటోఈస్ట్రోజన్లు ఉంటాయి. వీటిలో హృద్రోగాలు, ఆస్టియొపోరోసిస్‌, రొమ్ము కేన్సర్‌ల నుంచి రక్షణ కల్పించే ఐసోఫ్లేవన్స్‌ అనే ఒక కోవకు చెందిన ఫైటోఈస్ట్రోజన్లు ఉంటాయి. 


అపోహ: గర్భనిరోధక సాధనాలతో పిసిఒడి రివర్స్‌ అవుతుంది.

వాస్తవం: ఇది అందరికీ వర్తించదు. గర్భనిరోధక మాత్రలతో పిసిఒడి అదుపులోకి రాకపోగా, పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉంటాయి. అయితే ఆహార, జీవనశైలి మార్పులు విఫలమైన సందర్భాలో మాత్రమే, ప్రత్యామ్నాయంగా వైద్యులు కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ను సూచిస్తారు. కాబట్టి వైద్యుల ప్రమేయం లేకుండా ఎవరికి వారు సొంత వైద్యం అనుసరించడం సరికాదు.

Updated Date - 2022-03-22T16:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising