ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త దంపతులు దాంపత్య జీవితంలో ఎలా మసలుకోవాలి?

ABN, First Publish Date - 2022-04-14T16:51:14+05:30

కొత్తగా పెళ్లై కాపురం మొదలుపెట్టాం. ఎలాంటి లోటు లేకుండా దాంపత్య జీవితాన్ని సం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(14-04-2022)

ప్రశ్న: కొత్తగా పెళ్లై కాపురం మొదలుపెట్టాం. ఎలాంటి లోటు లేకుండా దాంపత్య జీవితాన్ని సంతృప్తికరంగా ఆనందించడానికి ఏమైనా మార్గాలున్నాయా? అసలు కొత్త దంపతులు దాంపత్య జీవితంలో ఎలా మసలుకోవాలి?


- దివ్యారాజన్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: దంపతులు శారీరకంగా దగ్గరవటానికి ముందు మానసికంగా చేరువవ్వాలి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందానికి ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటి అంశాలన్నీ ఉన్న దాంపత్యం కచ్చితంగా ఆనందమయమవుతుంది. దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగటానికి తోడ్పడే అంశాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే...


వాస్తవిక అంచనాలు: పెళ్లికి ముందు దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు క ంటాం. ఇతరుల అనుభవాల ఆధారంగా ఏదేదో ఊహించుకుంటాం. దాంతో పెళ్లయ్యాక వాస్తవం ఊహకు ఏ కాస్త దగ్గరగా లేకపోయినా అసంతృప్తికి లోనవుతాం. కానీ లైంగిక విషయాల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ జీవితంలో సెక్స్‌ ఓ భాగం మాత్రమేననే నిజాన్ని గ్రహించాలి.

 

నిదానమే ప్రధానం: తక్కువ సమయంలో ఎక్కువ తెలుసుకోవాలనే తత్వం దాంపత్య జీవితంలో పనికిరాదు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుని మసలుకోవటానికి సమయం పడుతుంది. ఇదంతా నెమ్మదిగా జరిగే చర్య. లైంగికోద్రేకానికి గురయ్యే చర్యలు, మార్గాల మీద అవగాహన ఏర్పరుచుకోవాలి. ఈ విషయంలో ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇందుకోసం శరీరాలు, అవి స్పందించే తీరుల్ని ఇద్దరూ తెలుసుకోవాలి. 


ఎదుటి వారి తృప్తి మీదే దృష్టి: యాంత్రికంగా మసలుకోకుండా ఎదుటి వ్యక్తి సంతృప్తే ప్రధానంగా మసలుకోగలిగితే దంపతులిద్దరూ సమంగా దాంపత్య జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒకరి ఆనందం మీద మరొకరు దృష్టి పెడితే మనసులోని అర్థం లేని భయాలు పటాపంచలవుతాయి. ఆత్మవిశ్వాసంతో మెలగగలుగుతారు. ఫలితంగా మీ ప్రతి చర్యా జీవిత భాగస్వామి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. 


డాక్టర్‌. షర్మిల మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-04-14T16:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising