ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిరోజూ కొర్రల అన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

ABN, First Publish Date - 2022-02-05T20:22:14+05:30

మిల్లెట్స్‌ ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా కొర్రలను సూపర్‌ఫుడ్‌గా అభివర్ణించొచ్చు. ఈ ఆధునిక జీవితంలో చక్కటి ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను చాలామంది ఇష్టపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(05-02-2022)

మిల్లెట్స్‌ ఆరోగ్యానికి మంచివి. ముఖ్యంగా కొర్రలను సూపర్‌ఫుడ్‌గా అభివర్ణించొచ్చు. ఈ ఆధునిక జీవితంలో చక్కటి ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను చాలామంది ఇష్టపడుతున్నారు.


ఒకప్పుడు పల్లెల్లో కొర్రలతో సంగటి చేసుకునేవాళ్లు. గంజి తాగేవాళ్లు. ఆ తర్వాత బియ్యం ఆధునిక ఆహారం అయ్యింది. అయినప్పటికీ కొందరు బియ్యంలో తక్కువ పరిమాణంలో కొర్రలను కలిపి తినేవారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవాళ్లు అలా తినేవాళ్లు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలుగుతుంది కాబట్టే కొర్రలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. కొర్రలతో చేసిన రకరకాల ఫుడ్స్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. కొర్రదోశ, కొర్ర ఇడ్లీలు, కొర్రలతో చేసిన తీపి పదార్థాలు మార్కెట్లో పాపులర్‌ అయ్యాయి. 


కొర్రల్లో 8 శాతం ఫైబర్‌ ఉంటుంది. 12 శాతం ప్రొటీన్లు ఉంటాయి. కొర్రన్నం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. పైగా ప్రతిరోజూ తింటే.. బరువు తగ్గుతారు. కొర్రల్లో ఐరన్‌శాతం పుష్కలం. దీంతో రక్తహీనతను నివారించే లక్షణం వీటికుంది. నరాల బలహీనత, బీపీ ఉండేవారికి, ఆస్తమా ఉండే వారు కొర్రల్ని తింటే ఆ సమస్యలు తొలగిపోతాయి. మూర్చవ్యాధి, మతిమరుపు, కీళ్లనొప్పులను నివారించే లక్షణం వీటికుంది. 

Updated Date - 2022-02-05T20:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising