ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌందర్యానికి ఔషధంలా..

ABN, First Publish Date - 2022-07-18T17:43:46+05:30

మేని మెరుపులకు... కురుల ఆరోగ్యానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలు మార్కెట్‌లో ఉన్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేని మెరుపులకు... కురుల ఆరోగ్యానికి ఎన్నో రకాల సౌందర్య సాధనాలు మార్కెట్‌లో ఉన్నాయి. కానీ వాటన్నిటి కంటే సమర్థవంతంగా... ఔషధంలా పనిచేస్తుంది యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌. ప్రయత్నించి చూడండి. 


  • యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో రక్తస్రావాన్ని అరికట్టే సహజసిద్ధమైన గుణం ఉండడంవల్ల ఇది ఒక అద్భుత టోనర్‌లా పనిచేస్తుంది. 1:1 నిష్పత్తిలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కు నీటిని కలిపి ఓ స్ర్పే బాటిల్‌లో పోయండి. దీన్ని నేరుగా చర్మంపై స్ర్పే చేసుకోవచ్చు. లేదంటే కాటన్‌ ప్యాడ్‌తో అయినా అప్లయ్‌ చేయవచ్చు. 
  • ఇందులో పుష్కలంగా ఉండే యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు... చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను అరికట్టడంలో దోహదపడతాయి. పైన పేర్కొన్నట్టు... యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, నీరు సమపాళ్లలో కలిపిన మిశ్రమంతో జుట్టును శుభ్రం చేయాలి. లేదంటే షాంపూలో కలిపి అయినా వాడుకోవచ్చు. జుట్టును మృదువుగా చేయడంలోనూ ఇది తోడ్పడుతుంది. 
  • యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లోని మాలిక్‌ యాసిడ్‌ డెడ్‌ స్కిన్‌ను నిర్మూలించడంలో సహాయపడుతుంది. చేతులు, కాళ్లపై ఈ వెనిగర్‌ వేసి సున్నితంగా రుద్దితే డెడ్‌ స్కిన్‌ మాయమవుతుంది. చర్మం నిగారిస్తుంది. 
  • మొటిమల నివారణకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. పడుకొనే ముందు దూదిని ఈ వెనిగర్‌లో ముంచి, మొటిమలపై రాస్తే మంచి ఫలితాన్నిస్తుంది. 

Updated Date - 2022-07-18T17:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising