ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకుకూరలను రోజూ జ్యూస్‌లా తీసుకుంటే ఏమవుతుంది?

ABN, First Publish Date - 2022-03-04T20:29:23+05:30

ఏడాది పొడవునా, అందుబాటు ధరలకే లభించే ఆకుకూరలు అందరికీ మంచి పోషకాలందించే ఆహారం. ఆకుకూరలన్నిటిలోను సూక్ష్మపోషకాలైన విటమిన్‌ ‘సి’, నియాసిన్‌, విటమిన్‌ ‘కె’లతో పాటు కాల్షియం, ఐరన్‌లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-03-2022)

ప్రశ్న: ఆకుకూరలను రోజూ జ్యూస్‌లా తీసుకుంటే అసిడిటీ, గ్యాస్‌ లాంటి సమస్యలేవైనా వస్తాయా?


- మెహెర్‌, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: ఏడాది పొడవునా, అందుబాటు ధరలకే లభించే ఆకుకూరలు అందరికీ మంచి పోషకాలందించే ఆహారం. ఆకుకూరలన్నిటిలోను సూక్ష్మపోషకాలైన విటమిన్‌ ‘సి’, నియాసిన్‌, విటమిన్‌ ‘కె’లతో పాటు కాల్షియం, ఐరన్‌లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలు తినే అలవాటు అధిక రక్తపోటును తగ్గించేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. వీటిలో ఎక్కువగా ఉండే పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరయిడ్స్‌ను నియంత్రించేందుకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి పెద్దపేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తాయి. ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం తదితర ఖనిజాలున్న ఆకుకూరలు ఎదిగే వయసులో ఉన్న పిల్లలకూ శారీరక శ్రమచేసే పెద్దవారికీ కూడా మంచిది. ఆకుకూరల్లోని ఐరన్‌, ఫోలేట్‌ మహిళలలో... ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారించడానికి, తగ్గించడానికి పనిచేస్తుంది. ఆకుకూరలను జ్యూస్‌ చేసి వడకట్టి పీచు తొలగించడం వల్ల పోషక పదార్థాలు తగ్గిపోతాయి. సరిగా శుభ్రం చేయని ఆకుకూరలను పచ్చిగా జ్యూస్‌ రూపంలో తీసుకొంటే అందులోని వ్యాధి కారక సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఏవైనా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలున్న వారు ఎక్కువ మోతాదులో పచ్చి ఆకుకూరలు తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్‌ లాంటివి రావచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-03-04T20:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising