ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొడవైన జుట్టు కోసం.. వారానికి ఒకసారి ఇలా చేయండి!

ABN, First Publish Date - 2022-03-07T17:53:08+05:30

లావెండర్‌ అనే పేరు వినగానే మనకు ఆ రంగు, సువాసలే గుర్తుకొస్తాయి. ఈ ఎసెన్షియల్‌ ఆయిల్‌ సౌందర్య పోషణకూ తోడ్పడుతుంది. అన్ని రకాల జుట్టుకు ఉపయోగపడే లావెండర్‌ నూనె పొడి జుట్టును మెత్తగా, జిడ్డు జుట్టును పొడిగా మారుస్తుంది. అలాగే వెంట్రుకల పెరుగుదలకూ ఈ నూనె తోడ్పడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(07-03-2022)

లావెండర్‌ అనే పేరు వినగానే మనకు ఆ రంగు, సువాసలే గుర్తుకొస్తాయి. ఈ ఎసెన్షియల్‌ ఆయిల్‌ సౌందర్య పోషణకూ తోడ్పడుతుంది. అన్ని రకాల జుట్టుకు ఉపయోగపడే లావెండర్‌ నూనె పొడి జుట్టును మెత్తగా, జిడ్డు జుట్టును పొడిగా మారుస్తుంది. అలాగే వెంట్రుకల పెరుగుదలకూ ఈ నూనె తోడ్పడుతుంది. దీంతో తల పట్టించుకునే నూనె ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం!


10 చుక్కల లావెండర్‌ నూనె

5 చుక్కల సెడార్‌వుడ్‌ నూనె

2 చుక్కల కొబ్బరి నూనె

1 టీస్పూను ఆముదం


వీటన్నిటినీ కలిపి, మునివేళ్లతో కుదుళ్లకు పట్టించాలి. వెంట్రుకలు పలుచబడిన ప్రదేశాలు, ఊడిపోయిన ప్రదేశాలను వదలకూడదు. ఇలా నూనెతో మర్దన చేసిన తర్వాత, రాత్రంతా వదిలేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలపడడంతో పాటు, పోషణ అంది కురులు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇలా వారానికి ఒకసారి చొప్పున నెల రోజుల పాటు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.

Updated Date - 2022-03-07T17:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising