ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండె సమస్యలున్నవాళ్లు కివి పండును తింటే..

ABN, First Publish Date - 2022-06-14T17:34:14+05:30

పొటాషియం, ఫోలేట్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, కెలతో పాటు అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉండే కివి పండు అన్ని వయసుల వారికీ ఆరోగ్యకరమే! ఈ పండుతో పొందే వీలున్న మరికొన్ని ఆరోగ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొటాషియం, ఫోలేట్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, కెలతో పాటు అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉండే కివి పండు అన్ని వయసుల వారికీ ఆరోగ్యకరమే! ఈ పండుతో పొందే వీలున్న మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే...


లాక్సేటివ్‌: దీన్లోని పీచు, పెక్టిన్‌లు పేగుల ఆరోగ్యాన్ని ప్రేరేపించి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. 

ఉబ్బసం: దీన్లోని పుష్కలమైన విటమిన్‌ సి శ్వాసకోశ వ్యవస్థ మొత్తానికీ సహాయపడుతుంది. మరీ ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. వారానికి రెండు కివి పండ్లు తినగలిగితే ఉబ్బసం ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

రక్తపోటు: కివిలోని పొటాషియం, ఇతర ఖనిజ లవణాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ పండు తినడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోయే ‘వాటర్‌ రిటెన్షన్‌’ పరిస్థితి అదుపులోకి వస్తుంది.

కొలెస్ట్రాల్‌: దీన్లోని పీచు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఫలితంగా అధిక కొలెస్ట్రాల్‌ కూడా అదుపులోకి వస్తుంది. 

సహజసిద్ధ కాగ్యులెంట్‌: ఈ పండుకు రక్తాన్ని పలుచన చేసే గుణముంది. కాబట్టి గుండె సమస్యలున్నవాళ్లు ఈ పండును తినడం వల్ల గుండె పోటుకు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.

Updated Date - 2022-06-14T17:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising