ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిదేనా? ఉపయోగం ఉంటుందా?

ABN, First Publish Date - 2022-06-02T22:23:06+05:30

మా చిన్నప్పుడు వేసవిలో ఉదయాన్నే టిఫిన్‌కు బదులుగా చద్దన్నం పెట్టేవాళ్ళు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(02-06-2022)

ప్రశ్న: మా చిన్నప్పుడు వేసవిలో ఉదయాన్నే టిఫిన్‌కు బదులుగా చద్దన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పిల్లలకు అలా పెట్టవచ్చా? దీనివల్ల ఏవైనా ఉపయోగాలు ఉంటాయా?


- సులోచన, కడప


డాక్టర్ సమాధానం: వేసవికాలంలో వేడి తట్టుకునేందుకు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తుంది. వేడి టిఫిన్‌కు బదులు రాత్రి వండిన అన్నంలో ఉదయాన్నే పెరుగు కలిపి తినేవారు. ఉదయాన్నే ఎక్కువగా నూనెలు వేసి తయారు చేసే టిఫిన్ల కంటే ఈ పెరుగన్నం మంచిది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో పగలంతా కూడా ఆటలాడి అలసిపోయే పిల్లలకు ఇది మంచి ఆహారం. దీనితో పాటు పచ్చి ఉల్లి, టొమాటో లాంటి కూరగాయ లేదా పండ్ల ముక్కలు ఇవ్వవచ్చు. బాగా ఆటలాడి చెమట పట్టే పిల్లలకు పెరుగన్నంలో చిటికెడు ఉప్పు వేసి పెట్టడం ద్వారా చెమటతో నష్టపోయే లవణాలను భర్తీ చేయవచ్చు. ఈ పెరుగు చద్దన్నం అన్ని వయసులవారికీ అనువైన ఆహారమే కానీ మధుమేహం ఉన్నవారు అన్నానికి బదులుగా చిరుధాన్యాలను తీసుకుంటే మంచిది. రాత్రి వండిన అన్నాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే అన్నం పాడయ్యే అవకాశం ఉంది. ఇలా పాడైన అన్నం తినడం వల్ల ఫుడ్‌ పాయిజనింగ్‌ కూడా కావచ్చు. కాబట్టి చద్దన్నం తినేప్పుడు జాగ్రత్తలు అవసరం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-02T22:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising