ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కండిషనర్‌ కథ

ABN, First Publish Date - 2022-09-14T20:31:28+05:30

చాలా మంది షాంపుతో స్నానం చేసిన తర్వాత కండిషనర్‌ను వాడతారు. అయితే రోజూ కండిషనర్‌ వాడటం సరైనదేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది షాంపుతో స్నానం చేసిన తర్వాత కండిషనర్‌ను వాడతారు. అయితే రోజూ కండిషనర్‌ వాడటం సరైనదేనా? 


కండిషనర్‌ ఎందుకు: మన జుట్టులో సహజసిద్ధంగా నూనెలు ఉంటాయి. వీటి వల్ల జుట్టు మెత్తగా ఉంటుంది. అయితే తరచూ తల స్నానం చేస్తుంటే ఈ నూనెలు పోతాయి. జుట్టు గరకుగా తయారవుతుంది. అలాంటి సమయంలో కండిషనర్‌ను వాడటం వల్ల జుట్టులో ఉన్న తేమ త్వరగా పోదు. అంతే కాకుండా జుట్టు మెత్తగా అవుతుంది. అందువల్ల షాంపూతో తల స్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్‌ కూడా వాడమని నిపుణులు సూచిస్తూ ఉంటారు. 


ఎంత వాడాలి: ఎంత కండిషనర్‌ వాడాలనే విషయం జుట్టుపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ జుట్టు ఉంటే- ఎక్కువగా వాడాలి. కండిషనర్‌ను జుట్టు అంచులతో పాటుగా మొదళ్లలో కూడా రాసి- మూడు నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. 


ఎలాంటి కండిషనర్‌ వాడాలి: జుట్టు బాగా గరకుగా ఉంటే - మార్కెట్లో దొరికే హైడ్రేటింగ్‌ కండిషనర్లను వాడాలి. ఒక వేళ జుట్టు నూనెగా ఉంటే- వాల్యుమైజింగ్‌ కండిషనర్లు అందుబాటులో ఉంటాయి. వాటిని వాడితే మంచిది.

Updated Date - 2022-09-14T20:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising