ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాండింగ్‌ డెస్క్‌ మంచిదా? కాదా?

ABN, First Publish Date - 2022-09-13T19:48:16+05:30

పని ప్రదేశాల్లో ఎక్కువ సమయాల పాటు కూర్చుని పని చేసే సెడెంటరీ విధానానికి భిన్నంగా, స్టాండింగ్‌ డెస్క్‌ అనే కొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ని ప్రదేశాల్లో ఎక్కువ సమయాల పాటు కూర్చుని పని చేసే సెడెంటరీ విధానానికి భిన్నంగా, స్టాండింగ్‌ డెస్క్‌ అనే కొత్త వర్కింగ్‌ స్టైల్‌ వాడుకలోకొచ్చింది. అయితే ఈ విధానంతో ఆశిస్తున్నంత ఫలితం ఉండకపోవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.


స్టాండింగ్‌ సైన్స్‌

నిలబడి పని చేసుకోడానికి అనుకూలంగా కొన్ని కంపెనీలు, వాటి కార్యాలయాల్లో స్టాండింగ్‌ డెస్క్‌లను ప్రవేశపెట్టాయి. రోజు మొత్తంలో కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు నిలబడి పని చేసుకునేలా ఉద్యోగులను పోత్సహిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఊపందుకోడానికి కారణం ఎక్కువ గంటల పాటు కూర్చుని ఉండడం వల్ల ఒబేసిటీ, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి, వాటి నుంచి తప్పించుకోవడం కోసం స్టాండింగ్‌ వర్కింగ్‌ స్టైల్‌ను అనుసరించడం మేలని మనం భావించడమే! అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందనే ఒక అధ్యయనం తాజాగా బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. కూర్చుని పని చేసేవాళ్లు, రోజుకు గంట చొప్పున ఏడాది మొత్తంలో 12 గంటల పాటు నిలబడి పని చేసిన వాళ్ల మధ్య తేడాలను గమనించినప్పుడు, నిలబడి పని చేసిన వాళ్ల బరువు తగ్గడం లేదా కంటి నిండా నిద్రపట్టడం, పని ఉత్పత్తి పెరగడం లాంటి ప్రయోజనాలేవీ కనిపించలేదు. 


సిట్టింగ్‌ వర్సెస్‌ స్టాండింగ్‌

నిలబడి పని చేసే విధానంతో కలిగే ప్రయోజనాలపరంగా చేపట్టిన పరిశోధనలు, ఆ విధానంతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను నిక్కచ్చిగా నిరూపించలేకపోయాయి. ట్రయల్స్‌ సైతం ప్రభావవంతమైన ఆరోగ్య ఫలితాలనూ చూపించలేకపోయాయి. కొన్ని అధ్యయనాలు స్టాండింగ్‌ డెస్క్‌ విధానం పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తే, మరికొన్ని ఆ విధానం నిష్ప్రయోజనమని నిరూపించాయి. ఈ విధానం కచ్చితంగా ఉపయోగకరమైనదని నిరూపించే అధ్యయనాలు జరగవలసిన అవసరం ఉంది. నిలబడి పని చేసే విధానంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలనూ, ఉత్పాదకతనూ రూఢి చేయడం కోసం భారీ స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగులను పరిశీలించవలసి ఉంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో పరిశోధనలు, ప్రయోగాలూ సాగలేదు. 

Updated Date - 2022-09-13T19:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising