ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీరంలో ఐరన్ లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

ABN, First Publish Date - 2022-05-24T18:48:17+05:30

శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను సరఫరా చేసే అత్యంత కీలకమైన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో, ఐరన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన పరిపూర్ణ ఆరోగ్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(24-05-2022)

శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను సరఫరా చేసే అత్యంత కీలకమైన ప్రొటీన్‌ హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో, ఐరన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి మన పరిపూర్ణ ఆరోగ్యానికి ఈ ఖనిజ లవణం ఎంతో అత్యవసరం. ప్రపంచంలోని పోషక లోపాలన్నింటిలో ఐరన్‌ లోపం అత్యంత సహజంగా మారింది. మరీ ముఖ్యంగా మన దేశంలో యువతులు, మహిళల్లో ఈ లోపం ఎక్కువ. మన దేశంలోని మహిళల్లో 50% కంటే ఎక్కువ మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నట్టు నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో తేలింది. ఈ లోపాన్ని లక్షణాల ద్వారా గుర్తించి, భర్తీ చేసుకోవడం ఎంతో అవసరం. లోపాన్ని గుర్తించడం కోసం ఇవిగో ఈ లక్షణాలను గమనించాలి.


నిస్సత్తువ: ఐరన్‌ లోపంలో ఇది అత్యంత సాధారణ లక్షణం. ఎర్ర రక్తకణాలు మన శరీరంలోని అవయవాలు, కండరాలు, కణజాలాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఈ కణాలు లోపిస్తే నిస్సత్తువ, బలహీనతలు ఆవరిస్తాయి. 


పాలిపోయిన చర్మం: మన ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ వల్లే మన చర్మం గులాబీ రంగు సంతరించుకుంటుంది. మన ఎర్ర రక్తకణాల్లో ఐరన్‌ తగ్గితే, చర్మం రంగు తగ్గి తెల్లగా పాలిపోతుంది. ఐరన్‌ లోపాన్ని కనిపెట్టే మరో మార్గం కూడా ఉంది. కనురెప్పల లోపలి భాగం తెల్లగా మారినా ఐరన్‌ లోపం ఉన్నట్టు భావించాలి. 


శ్వాస: ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం ఇబ్బంది తలెత్తినా, చిన్నపాటి శారీరక శ్రమలకే ఛాతీలో నొప్పి మొదలవుతున్నా ఐరన్‌ లోపంగా భావించాలి. హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడం వల్ల, శరీరం మొత్తానికీ సరిపడా ఆక్సిజన్‌ అందదు. దాంతో శరీరం ఇతర ప్రదేశాల నుంచి తనకు అవసరమైన అదనపు ఆక్సిజన్‌ను సంగ్రహిస్తుంది. ఈ క్రమంలో ఊపిరి అందకపోవడం, ఛాతీ నొప్పి మొదలైన లక్షణాలు మొదలవుతాయి.


తలనొప్పి: శరీరంలో ఐరన్‌ తగ్గితే, తరచూ తలనొప్పి వేధిస్తుంది. ఐరన్‌ తగ్గడం వల్ల మెదడుకు అందే ఆక్సిజన్‌లో కొరత ఏర్పడి, మెదడులోని రక్తనాళాలు వాపుకు గురవుతాయి. దాంతో తలతిరుగుడు, రక్తపోటు తగ్గడం, తలనొప్పి లాంటి లక్షణాలు మొదలవుతాయి.


గుండె: శరీరంలో ఆక్సిజన్‌ తగ్గితే, గుండె సక్రమంగా పనిచేయలేదు. దాంతో తీవ్ర ఐరన్‌ లోపం ఏర్పడితే, గుండె కొట్టుకునే తీరులో మార్పులు మొదలవుతాయి. 


జుట్టు, చర్మం: ఇవి రెండూ మన శరీరంలో సెకండరీ ఆర్గాన్స్‌. అంటే శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా తగ్గితే, దాని అవసరం ఎక్కువగా ఉండే ప్రధాన అవయవాలకు మొదట ఆక్సిజన్‌ చేరుకుని, మిగిలినది మాత్రమే వెంట్రుకలు, చర్మం మొదలైన ద్వితీయ అవయవాలకు ప్రసరిస్తుంది. దాంతో మన చర్మం, వెంట్రుకలు పొడిబారతాయి. శరీరంలో ఐరన్‌ నిల్వకూ, విడుదలకూ తోడ్పడే ఫెరిటిన్‌ అనే ప్రొటీన్‌ లోపం మూలంగా చర్మ సమస్యలు మొదలవుతాయి. వెంట్రుకలు రాలిపోతాయి.


నాలుక: వైద్య పరీక్షలో డాక్టర్లు మొదట మన నాలుక పరీక్షిస్తూ ఉంటారు. మన ఆరోగ్య సమస్యలు నాలుకలో ప్రతిఫలిస్తాయి కాబట్టే భౌతిక పరీక్షలో నాలుక కీలకంగా మారుతుంది. నాలుక వాచినా, రంగు మారినా, పాలిపోయినా ఐరన్‌ లోపానికి సూచనగా భావించాలి. నాలుక మీద పగుళ్లు కూడా ఐరన్‌ లోపానికి సూచనే.

Updated Date - 2022-05-24T18:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising