ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండిలా..!

ABN, First Publish Date - 2022-03-19T18:47:15+05:30

వేసవికాలం చర్మ సౌందర్యం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలంటే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-3-2022)

వేసవికాలం చర్మ సౌందర్యం దెబ్బతినకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలంటే....


సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోకుండా బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లే అరగంట ముందు అప్లై చేసుకుంటే మరీ మంచిది.  ఎండకు శిరోజాలు కూడా దెబ్బతింటాయి. వేసవిలో రోజూ షాంపూతో స్నానం కూడా మంచిది కాదు. అందుకే వారానికొకసారి హెయిర్‌మాస్క్‌ ఉపయోగించాలి. చర్మం పీహెచ్‌ విలువలు బ్యాలెన్స్‌గా ఉండాలంటే గ్లిజరిన్‌ ఉండే ఫేసియల్‌ వాటర్‌ను ఉపయోగించాలి. ఇది చర్మానికి నిగారింపును ఇవ్వడంతో పాటు మృదువుగా ఉండేలా చేస్తుంది. బయటకు వెళ్లి వచ్చాక క్లెన్సర్‌తో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఎండ వల్ల చేతులు, కాళ్లు, ముఖం నల్లబడతాయి. అందుకే యాంటీ ట్యానింగ్‌ క్రీమ్‌ తప్పక ఉపయోగించాలి. చర్మం రికవరీ కావడానికి ఇది ఉపకరిస్తుంది. వారానికోసారి చర్మానికి మాయిశ్చర్‌ కోసం ఫేసియల్‌ చేసుకోవాలి. ఒక బౌల్‌లో నాలుగైదు స్ట్రాబెర్రీలు తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత అందులో ఒక టేబుల్‌స్పూన్‌ పెరుగు, ఒక అర టీస్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగించిన తరువాత బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి.

Updated Date - 2022-03-19T18:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising