ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలు ఆహారాన్ని ఇష్టంగా తినాలంటే ఇలా చేయండి!

ABN, First Publish Date - 2022-04-07T17:12:06+05:30

చంటి పిల్లలు కడుపు నిండేలా వాళ్ల చేత ఆహారం తినిపించడం తల్లికి కత్తి మీద సామే! అయితే పదార్థాల పట్ల వాళ్లకు ఆసక్తి కలిగే కబుర్లు చెప్పగలిగితే కొంత ఫలితం ఉంటుంది. అందుకోసం తల్లులు అనుసరించవలసిన చిట్కాలివే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(07-04-2022)

చంటి పిల్లలు కడుపు నిండేలా వాళ్ల చేత ఆహారం తినిపించడం తల్లికి కత్తి మీద సామే! అయితే పదార్థాల పట్ల వాళ్లకు ఆసక్తి కలిగే కబుర్లు చెప్పగలిగితే కొంత ఫలితం ఉంటుంది. అందుకోసం తల్లులు అనుసరించవలసిన చిట్కాలివే!


యాపిల్స్‌ తింటే మంచిది అంటే పిల్లలు పెద్దగా పట్టించుకోరు. అందుకు బదులుగా ఎర్రని పండ్లతో శరీరం బలపడుతుంది అని చెప్పాలి. క్యారెట్లు తింటే కుందేలులా గెంతవచ్చు అని చెప్తే పిల్లలు నమ్మరు. అందుకు బదులుగా నారింజ రంగు పదార్థాలతో చీకట్లో కూడా చూడగలుగుతాం అని చెప్పాలి.

పసుపుపచ్చని ఆహారంతో ఎత్తు ఎదుగుతావు అనడానికి బదులుగా, గాయాలు త్వరగా మానిపోతాయి అని చెప్పాలి.

సలాడ్లు ఆరోగ్యకరం అనడానికి బదులుగా సలాడ్లతో వ్యాధులు దరిచేరవు అని చెప్పాలి.

నీలం రంగు ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అని చెబితే తినడానికి పెద్దగా ఇష్టపడరు. దానికి బదులుగా ద్రాక్ష పండ్లు తింటే తెలివితేటలు పెరుగుతాయి అని చెబితే వెంటనే తినేస్తారు.

తెల్లని ఆహారం మంచిది కాదు అనడానికి బదులుగా చక్కెర లాంటి తెల్లని పదార్థాలతో బలం దక్కదు అని చెప్పాలి.  ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా పిల్లలు ఇష్టంగా ఆహారం తినేలా చేయవచ్చు. 

Updated Date - 2022-04-07T17:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising