ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 ఏళ్ల నుంచి మధుమేహం ఉంది. కండరాలు పటుత్వం తగ్గుతున్నాయి.. ఏం చేయాలి?

ABN, First Publish Date - 2022-01-28T18:41:43+05:30

నాకు 58 ఏళ్లు. గత 24 ఏళ్ల నుండి మధుమేహం ఉంది. అయిదేళ్ల నుండి కండరాలు పటుత్వం తగ్గుతున్నాయి. నా జీవనశైలిలో ఏ విధమైన మార్పులు అవసరమో తెలుపగలరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-01-2022)

ప్రశ్న: నాకు 58 ఏళ్లు. గత 24 ఏళ్ల నుండి మధుమేహం ఉంది. అయిదేళ్ల నుండి కండరాలు పటుత్వం తగ్గుతున్నాయి. నా జీవనశైలిలో ఏ విధమైన మార్పులు అవసరమో తెలుపగలరు.


- ఆర్‌. కె., ఖమ్మం


డాక్టర్ సమాధానం: దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పుడు, జీవనశైలిలో వ్యాయామం భాగం కానప్పుడు వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గడం సాధారణం. కండరాలు బలంగా ఉండాలంటే ఎముకలు కూడా బలంగా ఉండాలి. ఆహారంలో కాల్షియం తగినంత ఉండేలా పాలు, పెరుగు, ఆకుకూరలు, గింజలు తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత ప్రొటీన్ల కోసం మాంసం, గుడ్లు, శాకాహారులైతే పప్పులు తరచుగా తినాలి. రిఫైన్డ్‌ ధాన్యాలైన బియ్యం, మైదాతో చేసిన బ్రెడ్డు లాంటివి మానేసి ముడి ధాన్యాలే అధికంగా తీసుకోవాలి. వ్యాయామం కోసం కేవలం నడక మాత్రమే కాకుండా ఏవైనా బరువులు ఉపయోగించి చేసే వ్యాయామాలు కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. శరీరానికి తగినంత ఆహారం తీసుకోకపోతే కూడా బరువుతో పాటు కండరాల పటుత్వం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువును నియంత్రించుకునే విధంగా ఆహారాన్ని, జీవనశైలిని అలవర్చుకోండి.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2022-01-28T18:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising