ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవిలో చర్మం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2022-04-04T16:41:00+05:30

వేసవిలో చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవాలి. ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవిలో చర్మ సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవాలి. ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే...


వేసవిలో బయటకు వెళ్లే ముందు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ తప్పకుండా రాసుకోవాలి. ఎస్‌పీఎఫ్‌ 20-50 ఉన్న సన్‌స్ర్కీన్‌ను ఉపయోగించాలి. ఇది అన్ని చర్మాల వారికి నప్పుతుంది.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి డైట్‌ తీసుకోవాలి. మీరు తీసుకునే పోషకాల వల్లే చర్మానికి నిగారింపు వస్తుంది. ఆరెంజ్‌, వాటర్‌ మెలన్‌, ద్రాక్ష వంటి వాటిని వేసవిలో ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి.

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకున్నాక విటమిన్‌ - సి సీరం అప్లై చేయాలి. విటమిన్‌ - సి సీరం ఒక యాంటీ ఆక్సిడెంట్‌. 

ఈ సీజన్‌లో మేకప్‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేయర్స్‌ ఎక్కువగా వేయడం, మేకప్‌ ప్రోడక్ట్స్‌ అదే పనిగా ఉపయోగించడం వల్ల మొటిమల సమస్యకు దారితీస్తుంది. 

మేకప్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోవద్దు. వారంలో ఒకటి రెండు రోజులు ఆర్గానిక్‌ స్క్రబ్‌ తప్పక వాడాలి. 

Updated Date - 2022-04-04T16:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising