ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరినూనెలో మందారపువ్వు, కరివేపాకు వేసి ఉపయోగిస్తే..

ABN, First Publish Date - 2022-04-25T16:40:56+05:30

జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుంది. రక్తసరఫరాను పెంచుతుంది. తగినంత మాయిశ్చర్‌ ఉండేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(25-04-2022)

జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె బాగా ఉపయోగపడుతుంది. రక్తసరఫరాను పెంచుతుంది. తగినంత మాయిశ్చర్‌ ఉండేలా చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. కొబ్బరినూనెను కాస్త వేడి చేసి తలకు పట్టించి మర్దన చేయాలి. కొబ్బరినూనెలో మందారపువ్వు, కరివేపాకు వేసి ఉపయోగిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది.


తెల్లజుట్టును నల్లగా మార్చుకోవడం కోసం హెన్నాను ఉపయోగిస్తారు. హెన్నా చుండ్రును దూరం చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉసిరి నూనె, ఉసిరికాయ పొడిని తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరికాయపొడిని గోరువెచ్చటి నీళ్లలో కలిపి, పెరుగు, తేనె వేసి జుట్టుకు ప్యాక్‌గా వేస్తే సరి. తులసి ఆకులను హెర్బల్‌ టీలో వాడతారు. అయితే వీటిని హెయిర్‌ప్యాక్‌గా ఉపయోగించ వచ్చు. తులసి ఆకులను, ఉసిరికాయ పొడిని కలిపి ఉపయోగిస్తే జుట్టు శుభ్రపడుతుంది. 


మృతకణాలను తొలగించి స్కాల్ప్‌ను శుభ్రం చేయడంలో కలబంద బాగా ఉపకరిస్తుంది. జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కోడిగుడ్డు తెల్లసొన, పెరుగును హెన్నాలో కలిపి ప్యాక్‌గా ఉపయోగించినా న్యాచురల్‌ కండిషనర్‌గా పనికొస్తుంది. ఈ జాగ్రత్తలతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. కంటినిండా నిద్రపోవాలి. 

Updated Date - 2022-04-25T16:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising