ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల పాపకు ఎలాంటి ఆహారం పెట్టాలి?

ABN, First Publish Date - 2022-06-04T19:50:05+05:30

రెండేళ్ల వయసు దగ్గరపడేకొద్దీ పిల్లల ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. ఎదుగుదల వేగంలో కూడా మార్పులు వచ్చి ఆకలి మందగిస్తుంది కూడా. ఆటలమీద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-06-2022)

ప్రశ్న: మా పాపకు రెండేళ్లు. తను ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి డైట్‌ను అలవర్చాలి.


- నిమీష, శ్రీకాళహస్తి


డాక్టర్ సమాధానం: రెండేళ్ల వయసు దగ్గరపడేకొద్దీ పిల్లల ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. ఎదుగుదల వేగంలో కూడా మార్పులు వచ్చి ఆకలి మందగిస్తుంది కూడా. ఆటలమీద ఎక్కువ ధ్యాస ఉండడం వల్ల ఆహారాన్ని ఇష్టంగా తీసుకునే అవకాశాలు తక్కువ. రెండు నుంచి నాలుగేళ్ల వయసు పిల్లల ఆహారపు అలవాట్లను గమనించేందుకు ఓ పద్ధతి ఉంది. రోజూ తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ల ఆకలిని నిర్ణయించడంగాక వారమంతా ఎలా తింటున్నారో గమనించాలి. విడిగా ఆహారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు ఎవరో ఒకరు పిల్లలతో కలిసి భోంచేయాలి. ఇంట్లోవారి ఆహారపు అలవాట్లను, వారు ఆహారం గురించి చెప్పే మాటలను బట్టి కూడా పిల్లలు కొన్ని రకాల ఆహారాలపై మక్కువ లేదా అయిష్టత ఏర్పరచుకుంటారు. వారికోసం ప్రత్యేకంగా వండకుండా కుటుంబమంతా తీసుకునే ఆహారాన్నే వారికి ఇవ్వాలి. వారి ఆకలిని బట్టి మాత్రమే ఆహారం ఇవ్వాలి. ఒకవేళ తినకపోతే బలవంతపెట్టడం, బెదిరించడం, ఏవైనా ఇష్టమైన వస్తువులు ఆశచూపడం లాంటి పద్ధతులు మానుకోవాలి. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఆహారాన్ని ఇవ్వాలి. ఆ సమయంలో తినలేదు కాబట్టి ఓ గంట తరువాత వారు కోరిన ఆహారాన్ని ఇవ్వడం అనేది అలవాటు చెయ్యకూడదు. తిరిగి నిర్దేశిత సమయంలోనే వారికి ఆహారాన్ని ఇవ్వాలి. ఈ వయసులో పిల్లలకు కొత్త రుచులు అలవాటు చెయ్యాలంటే, ఆ కొత్త పదార్థాన్ని కనీసం పదిహేను సార్లైనా రుచి చూసిన తరువాత కానీ వారు దాన్ని ఇష్టపడరు అన్నది అర్ధం చేసుకోవాలి. ఒకసారి వద్దన్నారు కాబట్టి అలవాటు చేయకుండా విడిచిపెట్ట కూడదు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-04T19:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising