ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నలభై దాటితే చేయాల్సిన వ్యాయామాలు

ABN, First Publish Date - 2022-04-30T17:44:05+05:30

నలభై ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండాలంటే కష్టమైన వ్యాయామాలు చేస్తే శరీరానికి మంచిది కాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(30-04-2022)

నలభై ఏళ్లు దాటాక ఫిట్‌గా ఉండాలంటే కష్టమైన వ్యాయామాలు చేస్తే శరీరానికి మంచిది కాదు. క్రంచెస్‌, కార్డియో వర్కవుట్స్‌, మోకాళ్ల కండరాలపై ఒత్తిడి చేసే వ్యాయామాలు, పుషప్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలభై ప్లస్‌లో ఉండే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన వ్యాయమాలు తెలుసుకుందాం.


జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి... ఇలా పలు కారణాల వల్ల నలభై ప్లస్‌లోనే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. శరీరం చురుగ్గా ఉంచుకోవాలంటే శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా ప్రతి రోజూ నడక తప్పనిసరి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. మంచి నిద్ర పడుతుంది. జాగింగ్‌ చేసినా మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల హానికరమైన కొవ్వు తగ్గుతుంది. ఎలాంటి పరికరాలూ అవసరం లేదు. కేవలం మంచి షూ ఉంటే సరిపోతుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవటం వల్ల మెటబాలిజమ్‌ పెరుగుతుంది. నొప్పులు, వాపులతో బాధపడుతుంటే క్యాల్షియం ఉండే ఆహారపదార్థాల్ని తినాలి. తేలికపాటి స్ర్టెచ్చింగ్‌ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సైక్లింగ్‌ చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. హార్వర్డ్‌ యూనివర్శిటీ వారు చేసిన ఓ అధ్యయనం ప్రకారం సైక్లింగ్‌ చేసే వారి శరీరం ఫిట్‌గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తక్కువని తేలింది.


ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలికగా చేసే వర్కవుట్‌ ఏంటంటే.. ఈత కొట్టడం. ఈతవల్ల బరువు తగ్గుతారు. శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలవాటు చేసుకుంటే ఇదో ఉత్తమ వ్యాయామం.వాస్తవానికి గృహిణులు ఇంట్లో చేసే పనులూ మంచి వ్యాయామాన్ని ఇస్తాయి. అయితే ఒత్తిడి, సరైన పోషకారం తీసుకోలేకపోతే అనేక సమస్యలు దరి చేరతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు ఉండే వాళ్లు వర్కవుట్స్‌ కంటే యోగాను ఆశ్రయించడం మంచిది. యోగా గురుల సమక్షంలో తేలికపాటి యోగాసనాలు చేస్తే.. శరీరం ఉత్తేజంగా ఉంటుంది. యోగా అలవాటయితే.. మంచి నిద్రపడుతుంది. శరీరం స్ర్టెచ్‌ అవుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా ఒత్తిడి తగ్గి.. ఫిట్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది.


Updated Date - 2022-04-30T17:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising