ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోజనం చేసేప్పుడు నీళ్లు తాగుతున్నారా? అయితే..

ABN, First Publish Date - 2022-06-04T19:57:40+05:30

భోజనం చేసేప్పుడు నీళ్లు తాగితే జీర్ణరసాలు పలచబడి జీర్ణక్రియ మందగిస్తుందా? భోజనం చేసిన ఎంత సమయం తరువాత నీళ్లు తాగొచ్చు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-06-2022)

ప్రశ్న: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగితే జీర్ణరసాలు పలచబడి జీర్ణక్రియ మందగిస్తుందా? భోజనం చేసిన ఎంత సమయం తరువాత నీళ్లు తాగొచ్చు?


- హరనాథ్‌, హైదరాబాద్‌

 

డాక్టర్ సమాధానం: తగు మోతాదులో నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. భోజనం చేసే సమయంలో అధికంగా నీళ్లు తాగాలనిపించడానికి కారణం రోజులో మిగిలిన సమయంలో నీళ్లు సరిగా తీసుకోక పోవడమే. తగినంత నీళ్లు తీసుకోనప్పుడు భోజనసమయంలో నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం సరిపోదు. కాబట్టి ఆహారం తీసుకునేప్పుడు నీరు తాగవలసి వస్తుంది. అలాగే ద్రవపదార్థాలైన సాంబారు, రసం, మజ్జిగ లాంటివి తీసుకుంటున్నప్పుడు ఆహారంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగాల్సిన అవసరం అనిపించదు. ఆహారంలో ఉప్పు, కారం అధికంగా ఉన్నప్పుడు కూడా నీళ్ల అవసరం పడుతుంది. తినేటప్పుడు కొద్ది మోతాదులో నీళ్లు తాగడం వల్ల నష్టమేమీ ఉండదు. కానీ ఆహారంతో పాటు మరీ ఎక్కువగా నీళ్లు తీసుకుంటే ఇబ్బందిగా ఉండవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండడానికి ఒకేసారి కాకుండా ప్రతి గంటకొకసారి కొద్ది మోతాదులో నీళ్లు తీసుకుంటూ ఉంటే సరి పోతుంది. భోజనానికి అరగంట ముందు కొద్దిగా నీళ్లు తాగితే మంచిది. అలాగే తిన్న తరువాత కూడా  అరగంట సమయం ఇచ్చి నీళ్లు తాగితే అసౌకర్యం ఉండదు. 



డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-06-04T19:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising