ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో సీజనల్‌ వ్యాధులకు ఇలా చెక్‌ పెట్టండి

ABN, First Publish Date - 2022-07-18T20:17:05+05:30

వర్షాకాలంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సీజనల్‌ వ్యాధుల విజృభించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని వైద్యుల సూచన


ఆంధ్రజ్యోతి, విజయవాడ : వర్షాకాలంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సీజనల్‌ వ్యాధుల విజృభించే ప్రమాదం పొంచిఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తరుచూ రోగాల బారినపడుతుంటారు. టైఫైడ్‌, డెంగ్యూ, మల్లేరియా, డయేరియా వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉందని తల్లిదండ్రులకు వైద్యులు సూచిస్తున్నారు. 


రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలి

రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం పిల్లలకు అందించాలని డాక్టర్లు చెబుతున్నారు. నేటి తరం పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ కు అలవాటుపడుతున్నారు. అలాంటి ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రతిరోజు ఇచ్చే ఆహారంలో 60శాతం కూరగాయలు, పండ్లు ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. పీచు పదార్ధాలుండే ఆహారం అందించాలి. కేవలం ఆహారం మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలును ఎక్కువ మొతాదులో అందిస్తే పిల్లలు డిహైడ్రేషన్‌ అవ్వకుండా నివారించోచ్చు. తాజా పళ్ళ రసాలను అప్పటికప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుని ఇవ్వాలి. బయట మార్కెట్లో లభించేవి తాగడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. హైప్రోటిన్‌ ఉండే పదార్ధాలను ఆహారంగా ఇవ్వాలి. ఎగ్‌వైట్‌, రిచ్‌ ప్రొటీన్స్‌ ఉండే ఆహారాన్ని పిల్లలకు అందించాలి. ప్రతిరోజు సగ్గుబియ్యం, రాగి జావా వంటివి ఇస్తుండాలి. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • పిల్లలకు కాచి చాల్లరిన మంచినీటిని అందించాలి 
  • దోమ తెరలను ఉపయోగించాలి
  • సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట వాతావరణంలో ఆడుకోకుండా చూడాలి 
  • చేతులు శుభ్రపర్చుకోవడం నేర్పించాలి 
  • మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి


బయట ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి

చల్లని వాతావరణంలో చిన్నపిల్లలు ఎక్కువగా వ్యాధుల బారినపడుతుంటారు. వారికి అందించే ఆహారం, మంచినీళ్లుల్లో జాగ్రత్తలు పాటించాలి. దోమ తెరలు తప్పకుండా ఉపయోగించాలి. ప్రస్తుతం వచ్చే జ్వరాలు సాధారణంగా ఉన్నా కరోనా వచ్చిందనే భయందోళనలు తల్లిదండ్రుల్లో ఉంది. కరోనా చిన్నపిల్లల్లో అంత ప్రభావం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలావాట్లల్లో మార్పులు చేయాలి. పార్కులు, ఇతర బయట వాతావరణంలో పిల్లల్ని ఎక్కువ సేపు ఉంచకుండా చూడాలి. అలాగే వారికి వేడి చేసి చల్లారిన నీటిని అందించాలి. వర్షాకాలంలో తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి.


- డాక్టర్‌ ఎన్‌.హేమకుమార్‌, 

పిల్లల వైద్యనిపుణుడు, రైయిన్‌బో చిల్డ్రన్‌ హాస్పిటల్‌ 



Updated Date - 2022-07-18T20:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising