ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్ర లోపిస్తే...

ABN, First Publish Date - 2022-07-26T16:42:06+05:30

రాత్రి కొరవడిన నిద్రను పగటి పూట భర్తీ చేద్దాం అనుకునేవాళ్లే ఎక్కువ. కానీ రాత్రి నిద్ర కొరవడడం వల్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి కొరవడిన నిద్రను పగటి పూట భర్తీ చేద్దాం అనుకునేవాళ్లే ఎక్కువ. కానీ రాత్రి నిద్ర కొరవడడం వల్ల జరిగే నష్టం పగటి నిద్రతో భర్తీ కాదు. నిద్రలేమితో కలిగే నష్టాల గురించి అవగాహన ఏర్పరుచుకుని, నిద్రలేమిని దూరం చేసుకోవడం అవసరం.


మెదడు పనితీరు మందగిస్తుంది: నిద్రతో అనవసరపు ప్లేక్‌, వేస్ట్‌ తొలగిపోతుంది. నిద్ర తగ్గినప్పుడు ఆ పని జరగకపోవడం మూలంగా తలనొప్పి, చీకాకు వేధిస్తాయి.

ఒత్తిడి పెరుగుతుంది: ఒత్తిడికి స్పందించే తీరు, మెదడు యాంటిసిపేటరీ ప్రతిస్పందనలు తగ్గుతాయి. దాంతో ఒత్తిడి అదుపులోకి రాదు.

బరువు పెరుగుతాం: ఆకలిని నియంత్రించే, పొట్ట నిండిన భావనకు గురి చేసే హార్మోన్లు అదుపుతప్పి, ఆకలి మీద నియంత్రణ తప్పుతుంది. ఆకలికి కారణమైన గ్రెలిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరగడంతో అవసరానికి మించి తింటాం. 

ఇమ్యూనిటీ తగ్గుతుంది: శరీర రోగనిరోధకశక్తి స్పందన తగ్గుతుంది. దాంతో తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతాం.

గుండె జబ్బుల ముప్పు: నిద్రలో రక్తపోటు తగ్గుతుంది. నిద్రలోపంతో రక్తపోటు పెరిగి, ఆ ప్రభావం గుండెను దెబ్బతీస్తుంది.

మధుమేహం ముప్పు: నిద్రలేమితో ఇన్సులిన్‌ను నియంత్రణలో ఉంచే కార్టిసాల్‌, నోరిపైన్‌ఫ్రైన్‌ హార్మోన్ల మీద ప్రభావం పడుతుంది.

Updated Date - 2022-07-26T16:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising