ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిమెన్షియా బారిన పడిన పెద్దలతో ఎలా ఉండాలంటే..?

ABN, First Publish Date - 2022-03-22T17:32:29+05:30

పెద్ద వయసులో వేధించే డిమెన్షియా ఎంతో క్లిష్టమైన సమస్య. దీని బారిన పడిన పెద్దలతో మెలగడంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-03-2022)

పెద్ద వయసులో వేధించే డిమెన్షియా ఎంతో క్లిష్టమైన సమస్య. దీని బారిన పడిన పెద్దలతో మెలగడంలో కుటుంబసభ్యులు  కొన్ని మెలకువలను అలవరుచుకోవడం అవసరం. అవేంటంటే...


సరళమైన భాషలో: ఒకసారికి ఒకే ప్రశ్న అడగాలి. ఒకటికి మించి ప్రశ్నలను కలిపి అడగకూడదు.  

అవును, కాదు: ‘భోజనంలో ఏం తిన్నావు?’ అని కాకుండా, ‘‘భోజనం నీకు నచ్చిందా?’’ అని అడగాలి. ‘‘అవును లేదా కాదు’’ అనే సమాధానాలు పొందేలా మీ ప్రశ్నలు ఉండేలా చూసుకోవాలి.  

ఓర్పు అవసరం: డిమెన్షియా ఉన్న వ్యక్తులకు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగించాలి. అంతే తప్ప, ఒత్తిడికి లోను చేయకూడదు. వారి ప్రవర్తనతో చీకాకు, కోపం తలెత్తితే, స్వల్ప సమయం పాటు బ్రేక్‌ తీసుకుని, తిరిగి పూర్వపు ఓర్పును ప్రదర్శించాలి.  

నేర్పు అవసరం: కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సూటిగా కాకండా, సరళంగా చెప్పాలి. ఉదాహరణకు... ‘మా అమ్మ ఎక్కడుంది?’’ అని అడిగినప్పుడు ‘‘20 ఏళ్ల క్రితమే చనిపోయింది’’ అని చెబితే వారిలో అనవసరపు ఆందోళన తలెత్తుతుంది. కాబట్టి ‘ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు’ అని నేర్పుగా చెప్పాలి.  

మెలకువలు: డిమెన్షియా ఉన్న వ్యక్తిని ఆకర్షించడం కోసం మాట్లాడేటప్పుడు చూపులు కలపడం, చిరునవ్వు నవ్వడం, చేతులు కదలించడం, తాకడం లాంటి మెలకువలు అలవరుచుకోవాలి.   

కూడని మాటలు: ‘‘నీకు గుర్తుందా? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. మర్చిపోయావా? ఆ విషయం నీకెందుకు తెలియదు?’’ ఇలా... వారిని మరింత నిస్సహాయతకు లోను చేసే మాటలు మాట్లాడకూడదు.   

మాటల మూటలు: ఒకేసారి పది వాక్యాల్లో పట్టేటంత పెద్ద సంభాషణలు చేయకూడదు. బదులుగా తక్కువ పదాలతో కూడిన ఏక వాక్య ప్రయోగాలు చేయాలి.

Updated Date - 2022-03-22T17:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising