ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లలు సరిగ్గా తినకుండా ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఇలా చేయండి.

ABN, First Publish Date - 2022-02-25T18:38:32+05:30

వయసును బట్టి పిల్లలకు ఆహారం విషయంలో ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. పిల్లలకు మనం చిన్న తనం నుండి చేసే ఆహారపు అలవాట్ల వలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(25-02-2022)

ప్రశ్న: మా పాపకు అయిదేళ్లు. తినడానికి చాలా పేచీ పెడుతుంది. ఆమె పెరుగుదలకు సహాయపడే చక్కటి ఆహారాన్ని తెలియజేయండి.


- సుమన, హిందూపురం


డాక్టర్ సమాధానం:  వయసును బట్టి పిల్లలకు ఆహారం విషయంలో ఇష్టాయిష్టాలు మారుతుంటాయి. పిల్లలకు మనం చిన్న తనం నుండి చేసే ఆహారపు అలవాట్ల వలన వారు ఆరోగ్య వంతులుగా ఎదుగుతారు. పదిహేనేళ్లు వచ్చే నాటికి వారి ఆహారపు అలవాట్లను నియంత్రించి ఆరోగ్యకరమైన ఆహరం తీసుకునేట్లు అలవాటు చెయ్యకపోతే యుక్త వయసులో అధిక బరువు, ఊబకాయం తదితర సమస్యలు ఎదురవు తాయి. బడికి వెళ్లే వయసులో ఉన్న పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం కప్పు పాలు, ఓ గుడ్డు, ఇడ్లీ, దోస లాంటి అల్పాహారం ఏదైనా కొంత ఇవ్వవచ్చు. మధ్యాహ్నం ఆకుకూరలు, పప్పు, తక్కువ అన్నం లేదా రొట్టెలతో భోజనం ఇవ్వండి. కూర, పప్పు పరిమాణం ఎక్కువగా ఉండేలా చూడాలి. సాయంత్రం స్నాక్స్‌గా పళ్ళు, బఠాణీలు, సెనగలు, వేరుశెనగపప్పు, మరమరాలు, అటుకులు ఇస్తే మంచిది. నూనెతో చేసిన చిరుతిళ్ళు, బిస్కెట్లు, చాక్‌లెట్లు, చిప్స్‌, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌ క్రీమ్స్‌ లాంటివి నెలకు ఒకటి రెండుసార్లకు మించకూడదు. రాత్రి భోజనంలో కూడా తేలికగా ఉండే అన్నం లేదా చపాతీతో కొంతకూర, పెరుగు లేదా మజ్జిగిస్తే మంచిది. మరొక పండు కూడా తినేలా చూడవచ్చు. పిల్లలు రెండు గంటల సేపు ఆడుకునే అవకాశం ఇవ్వాలి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2022-02-25T18:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising