ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీచుపదార్థాలతో డిమెన్షియాకు చెక్‌!

ABN, First Publish Date - 2022-02-28T16:49:03+05:30

డైట్‌ శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతుంది. పీచుపదార్థాలు(ఫైబర్‌) అధికంగా లభించే ఆహారపదర్థాలను తీసుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-02-2022)

డైట్‌ శారీరక ఆరోగ్యంపైనే కాదు, మానసిక ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపుతుంది. పీచుపదార్థాలు(ఫైబర్‌) అధికంగా లభించే ఆహారపదర్థాలను తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని, డిమెన్షియా వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని ఇటీవలి అధ్యయనంలో వెల్లడయింది. జపాన్‌ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం వివరాలను న్యూట్రిషనల్‌ న్యూరోసైన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. ‘‘డిమెన్షియా రిస్క్‌ను తగ్గించడంలో డైటరీ ఫైబర్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు మేం గుర్తించాం. 1980లో మా అధ్యయనం ప్రారంభించాం.


1985 నుంచి 1999 మధ్యకాలంలో 40 నుంచి 60 సంత్సరాలు ఉన్న 3739 మంది నుంచి డేటాను సేకరించి అధ్యయనం చేశాం. వారిని 2020 వరకు గమనించాం.’’అని పరిశోధనలో పాలుపంచుకున్న ప్రొఫెసర్‌ కజుమస యమగిషి అన్నారు. 3739 మందిని వారు తీసుకుంటున్న ఫైబర్‌ అధారంగా నాలుగు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఎక్కువ ఫైబర్‌ తీసుకున్న వారిలో డిమెన్షియా డెవలప్‌ అయ్యే రిస్క్‌ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫైబర్‌లోనూ నీటిలో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటుంది. నీటిలో కరిగే ఫైబర్‌ ఓట్స్‌, సోయాబీన్స్‌, వేరుశనగ, శనగ వంటి వాటిలో ఉంటే, కరగని ఫైబర్‌ కూరగాయలు, మిల్లెట్లు, బ్రౌన్‌ రైస్‌ వంటి వాటిలో లభిస్తుంది.

Updated Date - 2022-02-28T16:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising